కరోనా క్రైసిస్ ఛారిటిని మొదలెట్టి గత ఏడాది కరోనా సమయంలో సినిమా కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణి చేసిన విషయం తెలిసిందే. ఈ సారి కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇప్పుడు సినిమా కార్మికులకు వాక్సిన్ వేయించే కార్యక్రమం ఇటీవలే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో 24 క్రాఫ్ట్స్ కు సంబందించిన సినీ కార్మికులకు వాక్సిన్ ఇస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం సక్సెస్ కావడంతో పాటు రెండో డోస్ వ్యాక్సినేషన్ కూడా జరుగుతుంది. ఇప్పటికే సినిమా రంగంలో ఉన్న కార్మికులు, నటీనటులు ఎందరో ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో పాల్గొని వాక్సిన్ వేసుకున్నారు. తాజాగా రెండో విడత వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా విజయవంతగా జరుగుతున్న నేపథ్యంలో గురువారం సి సి సి కమిటీ బ్లడ్ బ్యాంకు లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సందర్శించారు.
ఈ సందర్బంగా ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ .. ప్రపంచం అంతా సంవత్సరం న్నర నుండి అతలాకుతలం అయిపోతుంది. సినిమా పరిశ్రమ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అలాంటి సమయంలో చిరంజీవి గారు స్పందించి కరోనా సమయంలో సినిమా కార్మికులను ఆదుకునేందుకు సిద్ధమయ్యారు. చిరంజీవి గారి సంకల్పం వల్లే ఈ రోజు కార్మికులకు వాక్సిన్ అందింది. అలాగే కరోనా నుండి ప్రజలను కాపాడడానికి ఆక్సిజన్ ప్లాంట్స్ కూడా ఏర్పాటు చేసారు. ఆ తరువాత సినిమా కార్మికులకు వ్యాక్సినేషన్ కూడా వేయిస్తున్నారు. ఇప్పటివరకు 4000 మందికి పైగా వాక్సిన్ వేసుకున్నారు. ఈ రోజు వరకు ఈ సెకండ్ డోస్ కార్యక్రమం అందరు తీసుకుంటున్నారు. ప్రస్తుతం సినిమా వాళ్ళందరూ వాక్సిన్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం రోజు షూటింగ్స్ బిజీగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఎక్కడ, ఎవరు ఖాళి లేని పరిస్థితి. ఇలాంటి సమయంలో తప్పకుండా అందరు వాక్సిన్ వేసుకుంటే ఇంకా మంచిది. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సీసీసీ కమిటీ చేపట్టిన ఈ వాక్సిన్ డ్రైవ్ సక్సెస్ అవ్వడమే కాదు అందరు స్వతహాగా వాక్సిన్ వేయించుకునేందుకు ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్బంగా చారిటబుల్ ట్రస్ట్ వారికీ, సీసీసీ టీం, అపోలో వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు.
దర్శకుడు ఎన్ శంకర్ మాట్లాడుతూ .. కరోనా క్రైసిస్ చారిటి ఆధ్వర్యంలో సినిమా వర్కర్స్ 24 క్రాఫ్ట్స్ వారికీ ఉచిత వాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమం చిరంజీవి గారి చేతుల మీదుగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. చిరంజీవి ఆధ్వర్యంలో , ఛాంబర్ ఆధ్వర్యంలో, 24 క్రాఫ్ట్స్ ఆధ్వర్యంలో మొదలైన సీసీసీ కమిటీ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా సాగుతుంది. ఇప్పటివరకు 5000 మందికి పైగా వాక్సిన్ తీసుకున్నారు. మొదటి డోస్ సక్సెస్ ఫుల్ గా నడిచింది.. ఇప్పుడు రెండో డోస్ కూడా ఇస్తున్నారు.. కాబట్టి సినిమా కార్మికులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సినిమా రంగానికి సంబందం ఉన్న అందరూ దయచేసి వాక్సిన్ తీసుకోవడనికి ముందుకు రావాలి. ఈ వాక్సిన్ కార్యక్రమం వినాయక చవితి రోజు హాలిడే ఉంటుంది.. ఆ తరువాత శని, ఆదివారాల్లో వాక్సిన్ డ్రైవ్ కొనసాగుతుంది. ఆదివారం తో ఈ డ్రైవ్ ముగుస్తుంది కాబట్టి.. సీసీసీ ఆధ్వర్యంలో మొదటి డోస్ వేసుకున్న వారంతా సెకండ్ డోస్ వేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమం నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు అన్నారు.
చిత్రపురి కాలనీ ప్రెసిడెంట్ .. వల్లభనేని అనిల్ మాట్లాడుతూ .. కరోనా ఎఫెక్ట్ తో ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేసి ఎంతోమంది ప్రాణాలను కాపాడిన విషయం తెలిసిందే. ఇటీవలే టాలీవుడ్ లో ఏర్పాటు చేసిన సి సి సి (కరోనా క్రైసిస్ ఛారిటీ) ద్వారా సినీ కార్మికులకు వాక్సిన్ వేయించిన సంగతి తెలిసిందే. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి దాని ద్వారా ఎంతోమంది ప్రజలకు, అభిమానులకు, సినిమా కార్మికులకు సేవ చేస్తున్న విషయం మరచిపోలేనిది. కరోనా మహమ్మారి ప్రారంభ దశలోనే 2020 ఏప్రిల్లో సినిమా షూటింగ్స్ నిలిచిపోయి, లాక్ డౌన్ లో ఏ కార్మికులు బయటకు వెళ్లలేని పరిస్థితుల్లో సి సి సి నీ మనకోసం ఏర్పాటు చేసి, దానికి కమిటీని నియమించి, సినిమా రంగంలోని పెద్దలందరిని భాగస్వాములను చేసి, వేలాదిమంది సినీ కార్మికుల ఆకలి తీర్చే సంకల్పంతో మూడు దఫాలుగా నిత్యావసర వస్తువులు ఇంటింటికీ పంచి ఆదుకున్న విషయం తెలుగు సినీ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. కరోనా రెండవదశలో ప్రతి సినీ కార్మికుడికి ఆరోగ్య భద్రత కల్పించాలని సత్సంకల్పంతో మీరు వాక్సినేషన్ వేయిస్తున్నారు. ఇప్పుడిప్పుడే పరిశ్రమ కోలుకుంటుంది అనుకున్న సమయంలో మళ్ళీ లాక్ డౌన్ పడడంతో .. సినిమా కార్మికులకు ఎలాగైనా వాక్సిన్ వేయిచాలని నిర్ణయించి, వాక్సిన్ దొరకని పరిస్థితుల్లో కూడా అపోలో 24/7 సౌజన్యంతో మీరు ముందుకు వచ్చి అందరి సినీ కార్మికులకు వాక్సినేశన్ వేయించి, వారి ఆరోగ్యానికి భద్రత కల్పించిన మీకు ప్రత్యేక దన్యవాదాలు తెలుపుతున్నాను.
దర్శకుడు మెహర్ రమేష్ మాట్లాడుతూ .. సీసీసీ అనేది చిరంజీవి గారి మనసులోంచి వచ్చిన ఆలోచన. దానికి మమ్మల్ని అందరిని కలిపి టీం గా ఫార్మ్ చేసి అందరికి సహాయం చేయడానికి అవకాశం అందించారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతమందికి బ్లడ్ అందించాం . ఎవరికి ఎప్పుడు అవసరమైన సరే బ్లడ్ బ్యాంకు నుండి సహాయం అందుతుంది. లాస్ట్ ఇయర్ కరోనా సమయంలో సీసీసీ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు అందించారు.. గత ఏడాది వినాయక చవితి ముందు సరుకులతో పాటు బెల్లం, సేమియా కూడా అందించమని చెప్పారు.. అంటే అందరు కూడా పండగ చేసుకోవాలని ఆలోచన ఆయనది. నిజంగా అయన ముందు చూపు అంత గొప్పది. కరోనా వాక్సిన్ కోసం అయన ప్రభుత్వం, ప్రయివేట్ వారితో ఎంతగా మాట్లాడారో నాకు తెలుసు.. చిరంజీవి గారి సంకల్పం వల్లే ఈ రోజు కార్మికులకు వాక్సిన్ అందింది. చారిటబుల్ ట్రస్ట్ నుండి ఈ మద్యే ఆక్సిజన్ కూడా అందించారు.. ఇలా ఎంతోమందికి ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు అన్నారు.