YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

గ్రహ దోషాలను తొలగించే స్నానపు విధానం

గ్రహ దోషాలను తొలగించే స్నానపు విధానం

సూర్య దోషం తొలగడానికి : ఆదివారం 

మనం స్నానం చేసే నీటిలో కుంకుమపువ్వు గాని ఎర్రటి పూలు గాని ఆ బకెట్లో కొంచెం వేసి స్నానం చేసుకుంటే సూర్య దోషం తగ్గుతుంది

చంద్ర దోషం తొలగడానికి: సోమవారం

నీటిలో కొంచెం పాలు కానీ లేక పెరుగు గాని వేసుకుని స్నానం చేస్తే చంద్ర దోషం తగ్గుతుంది

కుజదోషం తొలగడానికి: మంగళవారం

నీటిలో బిల్వ ఆకులను గాని బిల్వ ఆకు పొడిని గాని వేసి స్నానం చేస్తే కుజదోషం తగ్గుతుంది

బుదదోషం తొలగడానికి: బుధవారం

నీటిలో సముద్రపు నీరు గానీ గంగా నది నీరు గాని లేక రాళ్ల ఉప్పు గాని వేసి స్నానం చేస్తే బుధ దోషం తగ్గుతుంది

గురు దోషం తొలగడానికి: గురువారం

నల్ల యాలకులను నీటిలో ఉడికించి వాటిని మనం స్నానం చేసే నీటిలో పోసి స్నానం చేస్తే గురు దోషం తగ్గుతుంది

శుక్ర దోషం తొలగడానికి: శుక్రవారం

యాలకులను నీటిలో ఉడికించి ఆ ఉడికించిన నీటిని మనం స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేస్తే శుక్ర దోషం తగ్గుతుంది

శని దోషం తొలగడానికి: శనివారం

నీటిలో నల్ల నువ్వులను నీటిలో కలుపుకొని స్నానం చేస్తే శని దోషం తగ్గుతుంది

రాహు దోషం తొలగడానికి: శనివారం

(మహిషాసి, అనేది సామ్రాణి ఇది నాటు మందు షాపులో దొరుకుతుంది )ఈ మహిషాసి పొడిచేసి నీటిలో ఉడకబెట్టి స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేస్తే రాహు దోషం తగ్గుతుంది

కేతు దోషం తొలగడానికి: మంగళవారం

గరిక (గడ్డి) ని ఉడకబెట్టి ఆ నీటిని మనం స్నానం చేసే నీటిలో కలుపుకుని స్నానం చేస్తే కేతు గ్రహ దోషం తగ్గుతుంది

Related Posts