బయటి ప్రపంచంలో ఎంత సాధించినా ఎన్ని సాధించినా మరుక్షణమే అవి పాతబడిపోయి సాధించినప్పుడు ఉన్న ఆనందం మరుక్షణమే కనుమరుగైపోతుంది. అంతలా మన చుట్టూ ఉండాల్సిన వాటికంటే ఎక్కువ ఉన్నాయి. అందుకోవాల్సిన వాటికంటే ఎక్కువ అందుబాటులో ఉన్నాయి. ఫలితం వెంటనే మొహం మొత్తేస్తుంది. ఇది సాధిస్తే నా జీవితం ధన్యం అనుకుని దానికోసం తీవ్రంగా శ్రమించి సాధిస్తే తీరా మరుక్షణమో లేక మరొక రోజో మరొక లక్ష్యం వచ్చి చేరుతుంది. ఇలా ఎన్నో లక్ష్యాలు ధన్యం అయినట్టే అనుకున్నవి. కాని ఎన్ని సాధించినా వాటి ఆనందం ఈరోజు ఉందా! ఉందా! అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే అసలైన ఆనందం మనలోనే ఉంది. ఇది ఎలా తెలుసుకోవడం,,,,,
ఏదైనా ఉంటేనే కనబడుతుంది. లేకపోతే లేదు. ఇదే కదా సూత్రం. అలానే నీలో ఉన్న భావతరంగాలు అంటే సంతోషం, దుఖం, ఆనందం, బాధ సుఖం, ఇవన్ని నీలోనే ఉన్నాయి. అవి సందర్భాన్ని బట్టి ప్రకటిత మౌతున్నాయి. వస్తువే లేకపోతే తీసుకోవడానికి ఏమి ఉండదు. ఈ భావాలు నీలో నిగూఢంగా ఉన్నాయి కనుక ఆయా సందర్భాలను బట్టి అవి వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా అనారోగ్యం వస్తే మందులు వేసి ఆరోగ్యం బాగుచేశామని చెప్తారు. నిజానికి ఆరోగ్యం ఉంది. మందు వేసింది అనారోగ్యానికే. వ్యాధి నయం చేశారు అంతే. ఆరోగ్యం చెడిపోవడం బాగుపడటం ఉండదు. శరీరానికి వ్యాధి వచ్చినప్పుడు ఔషదం ఇచ్చి వ్యాధి తగ్గిస్తారు. నిజానికి ఆనందం నీలో ఉంది. కాకపోతే ప్రాపంచిక వ్యవహారాలతో మనస్సుని మలినం చేసుకొని ఆనందం అంటే ప్రపంచంలో ఫలానా సాధిస్తేనే దొరుకుతుంది అనే ఒక భ్రమలో పడిపోయారు. ప్రపంచంలో ఏమీ లేదు. ఉన్నదంతా నీలోనే ఉంది. ప్రపంచాన్ని చూసి ఇలా ఉంటే సుఖం, ఇలా ఉంటే దుఃఖం, ఇలా ఉంటే సంతోషం,,,,
ఇది సాధిస్తే ఫలానా అని,,, తనలోనే కొలువై ఉన్న ఆనందానికి దూరంగా వెళ్ళి పోతున్నారు. కొద్దిగా సాధన చేస్తే తేలికగా అర్థమవుతుంది. నిజ ఆనందం పరమానందం అంతరంగమ్...
శివోహమ్