YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జల సంరక్షణ చర్యలు వేగవంతం : సీఎం చంద్రబాబు

జల సంరక్షణ చర్యలు వేగవంతం : సీఎం చంద్రబాబు

నీరు-ప్రగతి,వ్యవసాయంపై  సోమవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాల కలెక్టర్లు,వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గోన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ వర్షపాతంలోటు 11%ఉన్నా భూగర్భజల మట్టం 2.4మీ పెరిగిందని అన్నారు. జలసంరక్షణ చర్యలు మరింత ముమ్మరంగా నిర్వహించాలి. పంటకుంటలు,కాంటూరు ట్రెంచింగ్ పనులు వేగవంతం చేయాలి. నరేగాలో గత ఏడాదికన్నా ఈ నెలలో రూ.310కోట్లు ఎక్కువ చేశామని అన్నారు. ఏప్రిల్ లో రూ.750కోట్ల పనులు జరిగాయి,మే నెలలో రూ.1,000కోట్ల పనులు జరగాలి. ప్రతినెలా నరేగా ఇదే వేగంతో చేస్తే రూ.10వేల కోట్ల వినియోగం సాధ్యమే. లేబర్, మెటీరియల్ కాంపోనెంట్ నిష్పత్తి పాటించాలని అయన సూచించారు.  

అకాల వర్షాలకు వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న దెబ్బతిన్నాయన్నారు. ఉద్యాన పంటల ద్వారా ఆదాయం 25 నుంచి 30 శాతం పెరగాలన్నారు. ఏడాదికి 10 లక్షల ఎకరాల్లో పండ్లతోటల సాగు పెరగాలని, ఉద్యాన పంటల విస్తీర్ణం కోటి ఎకరాలకు విస్తరించాలన్నారు. అన్ని జిల్లాల్లో ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం కావాలన్నారు. ప్రతి పథకం ఎంత పూర్తి చేశాం, ఇంకెంత చేయాలనేది విశ్లేషించుకోవాలన్నారు.

Related Posts