YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మతతత్వవాదుల దాడులు పెరిగాయి : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

 మతతత్వవాదుల దాడులు పెరిగాయి : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక సంఘ్ పరివార్ శక్తుల దాడులు పెరిగిపోయాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. మోడీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒకటి కూడా అమలు చేయలేదని అయన అన్నారు. సోమవారం అయన మీడియాతో మాట్లాడారు. ధరలు విపరీతంగా పెరిగిపోయాయి నల్ల్లధనం వెనక్కి తీసుకొస్తామని చెప్పారు తీసుకురకపోగా బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టినవారు విదేశాలకు వెళ్లిపోతున్నారు. అనుభవజ్ఞుడని రాజధాని లేని రాష్ట్రానికి చంద్రబాబు తప్ప వేరే లేరని వోటు వేసి గెలిపించారు. గత పాలనతో పోలిస్తే చంద్రబాబు ఇప్పటి పాలన పూర్తి భిన్నంగా ఉందని అన్నారు. ఎమ్మెల్యేల దగ్గర నుండి అధికారులు వరకు పూర్తిగా అవినీతిమయమని అయన ఆరోపంచారు. ఈ రాష్ట్రానికి అన్యాయం జరగడానికి కారణం వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు అని అయన అన్నారు. రాష్ట్ర విభజన హామీలు ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్ పోరాడింది వెంకయ్య నాయుడు. మోడీ ,అమిత్ షా డబల్ గేమ్ ఆడుతున్నారు.  ఒకవైపు మిత్రపక్షం తెదేపాటు ఉంటూ మరో వైపు వైకాపాతో మంతనాలు జరుపుతున్నారు. ఇవాళ రాష్ట్రం 10 కోట్లు ఖర్చుపెట్టినవారు ఎమ్మెల్యే,40 కోట్లు ఖర్చు పెట్టేవారు యంపీలు గా పోటీ చేయడానికి అర్హులు అణా చర్చ జరుగుతుంది . డబ్బున్నవారే రాజకీయాల్లో ఉండాలన్న విధానంలో మార్పు రావాలి. కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామంటే ఎవరు హర్షించరు మా పార్టీ అందుకు సానుకూలం కాదని అన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ చీలిపోవడం వలన ఎనలేని నష్టం కలిగింది విడిపోయిన కమ్యూనిస్ట్ పార్టీ కలవాలి ఖచ్చితంగా భవిష్యత్తులో కలుస్తాయని అన్నారు. 

Related Posts