YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

భారీగా పెరిగిన జేఎన్టీయూ, ఉస్మానియా ఫీజులు

భారీగా పెరిగిన జేఎన్టీయూ, ఉస్మానియా ఫీజులు

హైదరాబాద్, సెప్టెంబర్ 13, 
బీటెక్ కోర్సుల ఫీజులను జేఎన్టీయూ, ఉస్మానియా యూనివర్సిటీలు భారీగా పెంచాయి. రెగ్యులర్‌‌తో పాటు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల ఫీజులను రెండింతలు చేశాయి. రెగ్యులర్ కోర్సుల ఫీజు18 వేలు ఉండగా.. దానిని 35 వేలకు పెంచాయి. ఇక సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల ఫీజు 70 వేలకు పెంచాయి. జేఎన్టీయూ హైదరాబాద్‌తో పాటు, మంథని, సుల్తానాపూర్, జగిత్యాల, సిరిసిల్ల క్యాంపస్‌లలో పెరిగిన ఫీజులు అమలవుతాయని జేఎన్టీయూ తెలిపింది. ఉస్మానియా ఇంజినీరింగ్ కాలేజీలోనూ పెరిగిన ఫీజులు అమల్లోకి వస్తాయి. ఓయూలో ఈ అకడమిక్ ఇయర్ నుంచి ప్రారంభిస్తున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుకు ఫీజును లక్షా 20వేలుగా నిర్ణయించారు. అయితే కాకతీయ, మహాత్మా గాంధీ వర్సిటీలు మాత్రం ఫీజులు పెంచలేదు.ఫీజులు పెంచుకోవచ్చని జులైలోనే వర్సిటీలకు విద్యాశాఖ పర్మిషన్ ఇచ్చింది. మినిమం 45 వేలుగా నిర్ణయించింది. అయితే జేఎన్టీయూ మాత్రం ఏకంగా 70 వేలకు పెంచింది. రాష్ట్రంలోనే పెద్ద యూనివర్సిటీ అయిన ఉస్మానియాలో ఫీజులు కూడా పెద్దగానే ఉన్నాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మషీన్ లాంగ్వేజ్ కోర్సు ఫీజును లక్షా 20వేలు చేసిన ఓయూ.. మైనింగ్ ఇంజనీరింగ్ ఫీజును లక్షగా నిర్ణయించింది. ప్రైవేట్ కాలేజీలను దాటి ఫీజులు వసూలు చేయనున్నాయి వర్సిటీ కాలేజీలు. రాష్ట్రంలోని ప్రైవేట్ కాలేజీల్లో హయ్యెస్ట్ ఫీజు లక్షా 34వేలుగా ఉంది. లక్షకు పైబడి ఫీజు వసూలు చేసే కాలేజీలు రాష్ట్రంలో 20 మాత్రమే ఉండగా.. ఆ లిస్టులోకి ఉస్మానియా కూడా చేరింది.

Related Posts