YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

ప్రధాని మోడీకి మరోసారి లేఖ రాసిన సీఎం

ప్రధాని మోడీకి మరోసారి లేఖ రాసిన సీఎం

ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు మరోసారి లేఖ రాశారు. విద్యుత్ చట్టం-2013కి సవరణలు చేయాలనే ప్రతిపాదన విరమించుకోవాలని, వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర నిర్ణయించే విధానం... రైతులకు మేలు చేసేలా ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీలో వరి సాగు ఖర్చు హెక్టారుకు రూ.1.08 లక్షలు అవుతోందని, క్వింటాలుకు రూ.1702 సాగు ఖర్చు అవుతుందని ఆయన లేఖలో వివరించారు. 15వ ఆర్థిక సంఘం విధివిధానాల్లో పేర్కొన్న ... 'జనాకర్షక పథకాలపై సమీక్ష' అనే అంశం అభ్యంతరకరమని సీఎం లేఖలో పేర్కొన్నారు.  ఉచిత్ విద్యుత్ పథకాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని పీఎం కి రాసిన లేఖలో ఆరోపించారు. విద్యుత్ చట్టం-2013కి సవరణలు చేయాలనే ప్రతిపాదన విరమించుకోవాలని, వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర నిర్ణయించే విధానం... రైతులకు మేలు చేసేలా ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు.  ఏపీలో వరి సాగు ఖర్చు హెక్టారుకు రూ.1.08 లక్షలు అవుతోందని, క్వింటాలుకు రూ.1702 సాగు ఖర్చు అవుతుందని ఆయన లేఖలో వివరించారు. సాగు ఖర్చు రూపాయి అయితే ... మద్దతు ధర 83 పైసలుగా ఉండటాన్ని సీఎం తప్పుబట్టారు.  వరితో పాటు అన్ని పంటలకు మద్దతు ధర నిర్ణయించాలని సీఎం సూచించారు. పంటల బీమా నిబంధనల్లో పలు మార్పులు అవసరమని అభిప్రాయపడ్డారు. బ్యాంకులకు విధించిన నిబంధనతో అనేక ఇబ్బందులు వస్తున్నాయని, రుణాల వివరాలను జాతీయ పంట బీమా పోర్టల్లో నమోదు చేయాలన్న నిబంధనతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.

Related Posts