YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సింగాపురం చెరువులో చేపపిల్లలను విడుదల చేసిన మంత్రి తలసాని

సింగాపురం చెరువులో చేపపిల్లలను విడుదల చేసిన మంత్రి తలసాని

కరీంనగర్
హుజురాబాద్ మండలం లోని సింగాపురం గ్రామ చెరువులో చేప పిల్లల విడుదల  కార్యక్రమంలో  పశు సంవర్ధక శాఖ, మస్త్య సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గోన్నారు. ఈ కార్యక్రమానికి  జడ్పీ చైర్మన్ కనుమల  విజయ, ఎమ్మెల్యే వి.సతీష్ కుమార్, పోలు లక్ష్మణ్, ఆర్డీవో సీహెచ రవీందర్ రెడ్డి, ఎంపీపీ, జడ్పీటిసి, సర్పంచ్ లు తదితరులు హజరయ్యారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ  గ్రామీణాభివృద్ధి బలోపేతం కావాలని చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తున్నాం. మత్స్య శాఖ ఆధ్వర్యంలో మత్స్య కారులకు వెహికిల్స్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక గ్రామీణ ప్రాంతాల్లో అన్ని వర్గాల వారు బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఎన్నికల కోసం ఏ పని చేయం, అన్ని రొటీన్ గా ప్రజల కోసం జరుగుతాయి,  దేశం, రాష్ట్రంలో ఏ రోజాయినా ఏ ప్రభుత్వం చెరువుల వద్దకు వచ్చి చేపల గూర్చి మాట్లాడారా, ప్రస్తుతం దేశంలో ఎక్కడా లేని విదంగా సీఎం కేసీఆర్ పల్లె బాగు కోసం అనేక పథకాలు ప్రవేశ పెట్టి అమలు చేస్తున్న గొప్ప వ్యక్తి. 93 కోట్ల చేప పిల్లలు, 25 కోట్ల రొయ్యలు చెరువులు, కుంటాల్లో పంపిణీ చేశాం. కాళేశ్వరం, కొండ పోచమ్మ లాంటి ఎన్నో ప్రాజెక్టులు పూర్తి చేసుకున్న తర్వాత చేప పిల్లలు వదులుతున్నాం. ప్రభుత్వం బలపర్చే వ్యక్తులకు సహకారాన్ని ఇవ్వాలి, అలా అయితే మరింత అభివృద్ధి సాధిస్తాం. దేవుళ్ళును ఎప్పుడో మన గ్రామీణ ప్రాంతాల్లో. కోలుస్తాం, ఎవరో వచ్చి చెప్పే అవసరం లేదని అన్నారు.

Related Posts