హైదరాబాద్
కాంగ్రెస్ పార్టీ పక్షాన సీఎం కేసీఆర్ వద్ద జరిగే దళిత బంధు రివ్యూ మీటింగ్ కు నేను హాజరవుతున్నానని సీఎల్పీ ఛీఫ్ భట్టి విక్రమార్క అన్నారు. పార్టీ పరంగా అందరి నాయకులతో చర్చించాము. దళిత బంధు రివ్యూ మీటింగ్ లో ఎలాంటి అంశాలు మాట్లాడాలి అనేదాని పైన అందరి సలహాలు తీసుకున్నాం. రివ్యూ మీటింగ్ అయిపోయిన తరువాత ఏం మాట్లాడమూ అనేది మీడియా ముఖంగా మరోసారి చెప్తానని అన్నారు.