YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

టీడీపీ కార్పోరేటర్ హత్యకు కుట్ర కుట్రను భగ్నం చేసిన పోలీసులు

టీడీపీ కార్పోరేటర్ హత్యకు కుట్ర కుట్రను భగ్నం చేసిన పోలీసులు

గుంటూరు
టీడీపీ కార్పోరేటర్ యల్లావుల అశోక్ యాదవ్ హత్యకు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేసారు.  ఆశోక్ యాదవ్ హత్యకుట్రను నిఘా వర్గాల ద్వారా తెలుసుకున్న పోలీసులు ఆట కట్టించారు. అశోకు ను మట్టుబెట్టేందుకు కన్నెగంటి బాలకృష్ణ పథకం పన్నినట్లు సమాచారం. గత ఎన్నికల్లో అశోక్ ను ఓడించేందుకు బాలకృష్ణ విశ్వ ప్రయత్నం చేశాడు. ఎస్పీ ఆదేశాల మేరకు బాలకృష్ణను పట్టాభిపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, బాలకృష్ణను కాపాడేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. గతంలో రౌడీ షీటర్ బసవల వాసు హత్య కేసులో బాలకృష్ణపై ఆరోపణలు వచ్చాయి. రాజకీయ ఒత్తిళ్లతో బాలకృష్ణను కేసు నుంచి తప్పించారనే ఆరోపణలు వచ్చాయి. అలాగే కాలవ రమణ హత్యకు బాలకృష్ణ పధకం పన్నగా పోలీసులు అతడిని తప్పించారు. మరో నలుగురిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఓ విద్యార్థినికి మత్తు మందు ఇచ్చి నగ్న చిత్రాలు వీడియోలు తీసిన కేసులో బాలకృష్ణపై ఆరోపణలు వున్నాయి.

Related Posts