YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

నేత కార్మికులు త్రిఫ్ట్‌ ఎంత క‌డితే అంతకు డ‌బుల్ ప్ర‌భుత్వం చెల్లింపు: హ‌రీశ్‌రావు

నేత కార్మికులు త్రిఫ్ట్‌ ఎంత క‌డితే అంతకు డ‌బుల్ ప్ర‌భుత్వం చెల్లింపు: హ‌రీశ్‌రావు

నేత కార్మికులు త్రిఫ్ట్‌ ఎంత క‌డితే అంతకు డ‌బుల్ ప్ర‌భుత్వం చెల్లింపు: హ‌రీశ్‌రావు
హుజూరాబాద్ సెప్టెంబర్ 13
చేనేత కార్మికులు త్రిఫ్ట్‌ ఎంత క‌డితే అంతకు డ‌బుల్ ప్ర‌భుత్వం చెల్లిస్తుంద‌ని మంత్రి హ‌రీశ్‌రావు తెలిపారు. హుజురాబాద్ పట్టణంలోని సిటీ సెంట్రల్ హాల్‌లో చేనేత కార్మికులకు నూలు, విక్ర‌యాల‌కు సంబంధించిన‌ రిబెట్ సబ్సిడీ చెక్కుల‌ను మంత్రులు హ‌రీశ్‌రావు, గంగుల క‌మ‌లాక‌ర్ క‌లిసి పంపిణీ చేశారు. త్రిఫ్ట్‌ కోసం త్వ‌ర‌లోనే రూ. 30 కోట్లు మంజూరు చేస్తామ‌ని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. ఇప్‌.టికే మంత్రి కేటీఆర్ చేనేత కార్మికుల కోసం రూ. 70 కోట్లు విడుద‌ల చేశార‌ని గుర్తు చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. హుజూరాబాద్ లో చేనేత కార్మికుల కోసం రూ. కోటి 90 లక్షలు మంజూరు చేశామ‌న్నారు. చేనేత సంఘం కార్మికులకు వచ్చే పెండింగ్ ఉన్న అన్ని రకాల డబ్బుల‌ను విడుద‌ల చేస్తున్నామ‌ని తెలిపారు. తెలంగాణ వచ్చాక చేనేత కార్మికులు తీసుకున్న అన్ని రకాల అప్పులు మాఫీ చేశామ‌న్నారు. చేనేత కార్మికుల స‌మ‌స్య‌ల‌పై త్వ‌ర‌లోనే సీఎం కేసీఆర్‌తో స‌మావేశం ఉంటుంద‌న్నారు. రైతు బీమా త‌ర‌హాలోనే మ‌త్స్య‌, గౌడ‌, చేనేత బీమా రాబోయే రోజుల్లో రాబోతుంద‌న్నారు. చేనేత కార్మికులకు అండగా ఉన్న టీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని ఆశీర్వ‌దించాల‌న్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తే ఇళ్లు లేని వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు, స్థలాలు ఉన్న వారికి ఇండ్లు క‌ట్టిస్తామ‌న్నారు. హుజూరాబాద్‌లో పద్మశాలి భవనం నిర్మిస్తాం. ఆ భవనానికి కొండా లక్ష్మణ్ బాపూజీ అని నామ‌క‌ర‌ణం చేస్తామ‌ని మంత్రి హ‌రీశ్‌రావు తెలిపారు.

Related Posts