YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

త్వరలో బ్లాక్ మనీ లెక్కలు

త్వరలో బ్లాక్ మనీ లెక్కలు

త్వరలో బ్లాక్ మనీ లెక్కలు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13, 
దేశంలో అడ్డూ అదుపు లేకుండా అక్రమ రీతిలో సంపాదించి.. ఆపై ఆ సొత్తునంతా విదేశాల్లో దాచుకున్న బ్లాక్ మనీ హోల్డర్స్‌కి ఇది నిజంగా బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. స్విస్ బ్యాంక్‌లో ఖాతాలు కలిగిన భారతీయుల సమాచారం ఈ నెలలో కేంద్ర ప్రభుత్వం చేతికి అందనుంది. ఆటోమేటిక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ (AEOI) కింద, భారత పౌరుల బ్యాంక్ ఖాతా వివరాలతో కూడిన మూడవ విడత డేటాను ఇండియా పొందనుంది. అయితే, గతంలో ఎన్నడూ లేని విధంగా విదేశాలలో భారతీయ పౌరులు కలిగి ఉన్న స్థిరాస్థి వివరాలనూ సేకరించనుంది. స్విట్జర్లాండ్ నుంచి డేటా పొందడం ఇది మూడో సారి. తొలి డేటాను 2019 సెప్టెంబర్‌లో సేకరించగా.. రెండో లిస్ట్‌ను 2020, సెప్టెంబర్‌లో భారత్ చేతికి అందింది.విదేశాలలో భారతీయులు దాచిన నల్లధనాన్ని వెనక్కి తెప్పించేందుకు భారత ప్రభుత్వం చేస్తున్న పోరాటం కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే రెండు దఫాలుగా బ్లాక్ మనీ కలిగిన వారి జాబితాను పొందిన భారత ప్రభుత్వం చేతికి మరికొద్ది రోజుల్లో థర్డ్ లిస్ట్ కూడా చేరనుంది. ఈ థర్డ్ లిస్ట్‌లో స్విట్జర్లాండ్‌లోని భారతీయుల ఫ్లాట్లు, అపార్ట్‌మెంట్‌లు, ఉమ్మడి యాజమాన్య రియల్ ఎస్టేట్ ఆస్తుల వంటి పూర్తి వివరాలు కేంద్ర ప్రభుత్వం చేతికి అందనున్నాయి. స్థిర చరాస్తుల ద్వారా వారికి వచ్చే ఆదాయ వివరాలను కూడా ఆ లిస్ట్‌లో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ లిస్ట్ ద్వారా ఆస్తులు, పన్నుల వివరాలను సేకరించడం కేంద్రానికి మరింత సులువు అవుతుంది.స్విస్ బ్యాంకుల్లో భారతీయుల ఖాతాల వివరాలు భారత ప్రభుత్వం చేతికి రావడం ఇది మూడవసారి. కానీ, స్థిరాస్తుల వివరాలు కూడా రావడం ఇదే తొలిసారి.భారతీయ పౌరులు కలిగి ఉన్న స్థిరాస్తుల సమాచారాన్ని పంచుకోవడానికి స్విట్జర్లాండ్ మొదటిసారి అంగీకరించింది. అయితే, లాభాపేక్షలేని సంస్థలకు విరాళాలు, సహకారం, డిజిటల్ కరెన్సీలో పెట్టుబడులు వంటి సమాచారాన్ని ఇవ్వడానికి మాత్రం అంగీకరించలేదు.

Related Posts