YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

పెట్రోల్ బంకులపై దాడులు

పెట్రోల్ బంకులపై దాడులు

పెట్రోల్ బంకులపై దాడులు
విజయవాడ, సెప్టెంబర్ 13
ఒకవైపు పెట్రో ధరలు మండిపోతుంటే… మరోవైపు బంకు యజమానులు మోసాలకు పాల్పడుతూ వినియోగదారులను అడ్డగోలుగా దోచేస్తున్నారు. బంకుల్లో మైక్రో చిప్ లు అమర్చి దోపిడీకి పాల్పడుతున్నారు. లీటరు పెట్రోల్ లో దాదాపు పావు లీటరు కొట్టేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తూనికలు కొలతలశాఖ చేపట్టిన తనిఖీల్లో మరోసారి మైక్రో మాయ బయటపడింది. రాష్ట్రవ్యాప్తంగా 600 పెట్రోల్ బంకుల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. తూనికలు కొలతలశాఖ తనిఖీల్లో పెద్దఎత్తున బంకుల మోసాలు బయటపడ్డాయ్.తప్పుడు కొలతలతో వినియోగదారులకు జేబులకు చిల్లు పెడుతున్నారు బంకుల యాజమాన్యాలు. టెక్నాలజీ టాంపరింగ్ తో మోసాలకు పాల్పడుతున్నారు బంక్ ఓనర్స్. మైక్రో చిప్ లు అమర్చి మన కళ్ల ముందే మనకు తెలియకుండా పెట్రోల్ ను కొట్టేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 17 బంకుల్లో మైక్రో చిప్ లను తూనికలు కొలతలశాఖ అధికారులు గుర్తించారు. విజయవాడ గుణదలలో ఓ పెట్రోల్ బంక్ ను సీజ్ చేసి… యజమానిపై కేసు నమోదు చేశారు. ఏపీలో ఎక్కువగా గుంటూరు, ప్రకాశం, కృష్ణాజిల్లాల్లో ఈ మైక్రో మోసాలను గుర్తించారు.మైక్రో చిప్ లతో మోసాలకు పాల్పడుతోన్న ముఠాలు ఎక్కువగా హైదరాబాద్ బంకుల్లోనే వాటిని అమర్చినట్లు గుర్తించారు. టెక్నాలజీని టాంపరింగ్ చేసి వినియోగదారుల జేబుకు చిల్లు పెడుతున్నారని అధికారులు చెబుతున్నారు. పెట్రోల్ బంకుల్లో మోసంపై సామాన్యులు భగ్గుమంటున్నారు. మరోసారి ఇలాంటి ఛీటింగ్ చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Related Posts