YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సీనియ‌ర్ల‌తో వైసీపీకి ఇబ్బందే

సీనియ‌ర్ల‌తో వైసీపీకి  ఇబ్బందే

విజ‌య‌వాడ‌, సెప్టెంబ‌ర్ 14, 
వైసీపీలో సీనియర్ నేతలు ఏం చేయలేకపోతున్నారా? తమకున్న అసంతృప్తిని అప్పుడప్పుడు బయట పెట్టడమే తప్ప పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోలేకపోతున్నారా? అంటే అవుననే అంటున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తుంది. కానీ జగన్ మాత్రం సీనియర్లను పట్టించుకోవడం లేదు. దీంతో వారిలో అసంతృప్తి తీవ్రస్థాయిలో ఉంది. కానీ వారు ప్రత్యేకించి ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి. మరో నాలుగేళ్లు అధికారం ఉండటంతో వారు మౌనంగానే సమయం కోసం వేచి చూస్తున్నట్లు కనపడుతుంది.శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన ప్రసాదరావు సీనియర్ నేత. దాదాపు ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గర ఆయన మంత్రిగా పనిచేశారు. మంచి మాటకారి. విపక్షాలకు సయితం ధీటుగా జవాబివ్వగల నేర్పరి. అలాంటి ధర్మాన ప్రసాదరావును జగన్ పట్టించుకోవడం లేదు. తనకంటే జూనియర్లు కేబినెట్ లోకి చేరడంతో ధర్మాన ప్రసాదరావు మరింత రగలిపోతున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై తన అసంతృప్తిని బయటపెట్టిన ధర్మాన ప్రసాదరావు తర్వాత మౌనంగానే ఉండిపోయారు. ఇల్లు వదలి బయటకు రావడం లేదు.దీనికి ప్రధాన కారణం జిల్లాలో తొలిసారి గెలిచిన అప్పలరాజు మంత్రి పదవిని చేపట్టారు. తన సోదరుడికి ప్రమోషన్ ఇచ్చి ఉప ముఖ్యమంత్రిని చేసినా తనకు అన్యాయం జరిగిందనే ధర్మాన ప్రసాదరావు భావిస్తున్నారు. ఆయన అందుకే అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కూడా ఆయన పెదవి విప్పడం లేదు. తన అక్కసునంతా మౌనం ద్వారానే ధర్మాన ప్రసాదరావు జగన్ కు తెలియజేస్తున్నారు.
ఇక మరో సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి కూడా ఇంతే. ఆయన గత కొద్దిరోజులుగా బయటకు రావడం లేదు. నియోజకవర్గానికే పరిమితమయ్యారు. ఈయన కూడా అసంతృప్తితోనే ఉన్నారు. ఒకటి రెండు సార్లు తన అసంతృప్తిని తెలియజేసినా షోకాజ్ నోటీసు వరకూ వెళ్లడంతో ఆయన మౌనమే మంచిదని భావిస్తున్నారు. మంత్రి వర్గ విస్తరణ వరకూ వెయిట్ చేయాలన్నది వీరిద్దరి ఆలోచనగా ఉంది. ఆ తర్వాత కూడా పదవులు రాకుంటే జగన్ కు వీరిద్దరూ పక్కలో బల్లేల్లా తయారే అవకాశాలున్నాయంటున్నారు. మొత్తం మీద సీనియర్ నేతలను జగన్ పట్టించుకోకుంటే భవిష్యత్తులో వీరి నుంచి ఇబ్బందులు మాత్రం తప్పేలా లేవు.

Related Posts