హైదరాబాద్, సెప్టెంబర్ 14,
సీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై పీయూసీ చైర్మన్ ఏ. జీవన్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. చీకటి పనులకు రేవంత్ రెడ్డి నెంబర్ వన్ బ్రాండ్ అంబాసిడర్ అంటూ విమర్శించారు. రేవంత్ హోల్ సేల్ బ్లాక్ మెయిల్ బ్రాండ్ అంబాసిడర్ అని ఎద్దేవ చేశారు. సీఎం కేసీఆర్ తెలంగాణకు అంబాసిడర్ అయితే.. అభివృద్ధికి కేటీఆర్ అనే సంగతి మరిపోవద్దన్నారు. డ్రగ్స్ కు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన పంజాబ్ అనేది రేవంత్ రెడ్డి మర్చిపోవద్దని.. ముందుగా ఊడ్త పంజాబ్ సినిమా చూసి రేవంత్ మాట్లాడాలని అన్నారు. TRS నాయకులు డేటాతో మాట్లాడితే.. రేవంత్ రెడ్డి నోటి తీటతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రేస్ పాలనలో హైదరాబాద్ అంతా రౌడీ షీటర్లతో నిండి ఉండేదని.. ఇపుడు సింగపూర్- బ్యాంకాక్ తరహాలో క్రైమ్ కంట్రోల్ సిటీగా తెలంగాణ పోలీస్ మార్చేసిందని అన్నారు. రేవంత్ రెడ్డి పోలీసులను సైతం బ్లాక్ మెయిల్ చేస్తుండని అన్నారు. కరోనా సమయంలో సొంత నియోజకవర్గమైన కొడంగల్- మల్కాజిగిరి ఎప్పుడు వెళ్లావా అంటూ ప్రశ్నించారు. రేవంత్ ఓ ఐరన్ లెగ్ అంటూ.. తెలంగాణలో టీడీపీకి పట్టిన గతే- కాంగ్రేస్‌కు పడుతుందని విమర్శించారు. రేవంత్ రెడ్డి గాడ్ ఫాథర్ చంద్రబాబే కేసీఆర్‌ను ఏం చేయలేక చేయలేకపోయాడని… లిల్లిపుట్ రేవంత్‌తో ఏం చేస్తాడని ఎద్దేవ చేశారు.