YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్ పర్సన్ గా పోనకా దేవసేనమ్మ ప్రమాణ స్వీకారం గూడూరు అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తా

స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్ పర్సన్ గా పోనకా దేవసేనమ్మ ప్రమాణ స్వీకారం గూడూరు అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తా

నెల్లూరు
గూడూరు అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తాను అనీ   రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్ పర్సన్ గా  పోనాక దేవసేనమ్మ వెల్లడించారు.విజయవాడలోని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కార్యాలయంలో అతిరథమహారధులు సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు.ఈ ప్రమాణ స్వీకార మహోత్సవంకు గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ రావు, మంత్రులు, ఎమ్మెల్యేలు,ప్రజాప్రతినిధులు,ప్రముఖులు, పోనాక అభిమానులు,కార్పొరేషన్   అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగాఎమ్మెల్యే వెలగపల్లి మాట్లాడుతూ గూడూరు మున్సిపాలిటీ అభివృద్ధి కి సేవలను అందించిన మాజీ మున్సిపల్ ఛైర్మన్ పోనాక దేవసేనమ్మను స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది అన్నారు.గూడూరు ఎమ్మెల్యే గా తాను గెలుపొందడానికి కూడా ఎంతో దేవసేనమ్మ ,శివకుమార్ రెడ్డి దంపతులు మరియు కుటుంబ సభ్యులు సహకరించారు అని వెల్లడించారు.   పొనకా దంపతులకు తాను రుణపడిఉన్నానన్నారు.ఎన్నికల్లో వారు ఎంతో కృషి చేశారని కొనియాడారు. పార్టీకి విశ్వాసంతో పనిచేసేవారు పొనకా దంపతులు అని తెలిపారు.గూడూరు పట్టణాభివృద్దికి దేవసేనమ్మ ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్ పర్సన్గా  పోనాక దేవసేనమ్మ  మాట్లాడుతూ తాను మున్సిపల్ చైర్ పర్సన్ గా ఐదేళ్ళ పదవీ కాలంలో గూడూరు పట్టణంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అని చెప్పారు. ,పరిశుభ్రతకు పెద్దపీట వేసి డంపింగ్ యార్డ్ కొరకు సొంత నిధులు ఖర్చు చేసి కొంత మేర సమస్యను పరిష్కరించాను అని తెలిపారు.స్వచ్ఛత, ఆరోగ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉంచాలన్నదే సీఎం జగన్మోహన్ రెడ్డి స్వచ్చ సంకల్పమని,వారి కలను సాకారం చేసేందుకు మేమందరం కృషి చేస్తామని స్పష్టం చేశారు.స్వచ్ఛాంధ్రకోసం ప్రజలు కూడా సహకరించాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, వారిని భాగస్వాములు చేస్తామని తెలిపారు. పరిశుభ్రతకు పెద్దపీట వేస్తామని పేర్కొన్నారు.
తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు అధికారులు, సిబ్బంది పనిచేసేవారని వారి సేవలను కొనియాడారు. అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రుల సహకారంతో ముందుకు వెళతామన్నారు. వచ్చేనెల రెండో తేదీన క్లీన్ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా ప్రత్యేకకార్యక్రమాన్నిచేపడుతున్నట్లు వెల్లడించారు.
పర్యావరణ పరిరక్షణ కొరకు   చెత్తబుట్టలు,వాహనాలు వంటివాటిని కేటాయించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో డంపింగ్ యార్డులు లేకుండా చేసేదానికి చర్యలు తీసుకుంటామని ,పట్టణాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు.పదవి అలంకారం కాదు అని, అభివృద్ధి కొరకు అహర్నిశలు కృషి చేస్తానని  దేవసేనమ్మ పేర్కొన్నారు.
అనంతరం ఎం.డి సంపత్ కుమార్,ఎస్. ఈ ఆనంద్,సిబ్బంది,ఎమ్మెల్యేలు, వైసిపి నేతలు ,ప్రముఖులు చైర్ పర్సన్ దేవసేనమ్మకు శాలువా లు కప్పి గజమాలలు వేసి పుష్పగుచ్ఛాలు అందించి అభినందన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర సంస్థ ఎం.డి సంపత్ కుమార్.సీ.ఈ ఆనంద్,వైకాపా నాయకులు పొనకా దివ్యతేజారెడ్డి, బాలిబోయిన రమేష్,అశోక్ కోదండరామయ్య,సురేష్ రెడ్డి.గోపాల్ యాదవ్,కోడిపర్తి శ్రీధర్,జమళ్ళవాసు,సాయి,ముని,హాషిం,ఇమ్రాన్.బిక్కుసాహెబ్.నరేష్ రెడ్డి.రవీంద్రబాబు , హాషీమ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts