మహబూబ్ నగర్ సెప్టెంబర్ 14
:భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ లో గోల్డెన్ లక్కీ హ్యాండ్ నేతగా మంచి గుర్తింపు చరిష్మా ఉన్న మహబూబ్ నగర్ మాజీ ఎంపీ ఆముదాల పాడు జితేందర్రెడ్డి పై బిజెపి కేంద్రం పెద్దలు మరో గురుతర బాధ్యతను అప్పగించారు. విస్తృతమైన ప్రజా సంబంధాలు మరియు ప్రతి ఒక్కరిని చిన్నాపెద్దా తేడా లేకుండా ఆప్యాయంగా పలకరించి ప్రేమానురాగాలు కురిపించే మంచి మనసున్న నేతగా అందరికీ రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బిజెపి విజయం మరియు దుబ్బాక లో చక్కటి ప్లానింగ్తో కమలం జెండాను ఎగరవేయడం వెనుక జితేందర్ రెడ్డి చక్కటి వ్యూహం ఉందని ఆపార్టీ నేతలు చెబుతున్నారు. తాజాగా ఈటెల రాజేందర్ హుజురాబాద్ లో గెలుపు బాధ్యతను కూడా రాష్ట్ర బిజెపి పెద్దలు జితేందర్ రెడ్డి కి అప్పగించారు. కేంద్రంలోని కమలం పెద్దలకు జితేందర్ రెడ్డి నాయకత్వంపై తిరుగులేని నమ్మకం ఉండడం వల్లనే తెలంగాణ రాజకీయాల్లో టర్నింగ్ పాయింట్ గా మారబోతున్న హుజురాబాద్ లో బిజెపి గెలుపు బాధ్యతను జితేందర్ రెడ్డి భుజస్కంధాలపై ఉంచినట్లుగా తెలుస్తోంది. 2014 నుంచి 2019 వరకు టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా గత ఎన్నికల్లో కేసీఆర్ టికెట్ నిరాకరించడంతో 2019లో నరేంద్ర మోడీ సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు జితేందర్రెడ్డి రాకపోయినప్పటికీ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఆయన ఎంతో శ్రమించి పని చేశారు. రాష్ట్రంలో లో ఓయ్ అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ ను గద్దె దించడమే లక్ష్యంగా జగన్ రెడ్డి జట్ స్పీడ్తో కమలం పార్టీ లో నేతలను సమాయత్తం చేస్తూ అందర్నీ కలుపుకుంటూ ముందుకు సాగుతున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.