YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సచివాలయంలో సీఎస్ ను కలిసిన కాంగ్రెస్ నేతలు

సచివాలయంలో సీఎస్ ను కలిసిన కాంగ్రెస్ నేతలు

సోమవారం నాడు తెలంగాణ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్వి ఎస్కే జోషిని టీ కాంగ్రెస్ నేతులు కలిసారు.  కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంపత్ కుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి శాసనసభ నుంచి బహిష్కరించడం అన్యాయమని అయనకు తెలిపారు. ఈ విషయంపై ఎమ్మెల్యే  మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఇద్దరు ఎమ్మెల్యేల బహిష్కరణపై హైకోర్టును సంప్రదించాం . 17 ఏప్రిల్ న ఇచ్చిన జడ్జ్మెంట్ అందరికి తెలిసిందే. శాసనసభలో సభ్యుల సభ్యత్వాలను రద్దు చేయడం చెల్లదంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిందని అన్నారు. హైకోర్టు తీర్పును అమలు చేయాలనీ సీఎస్ ను కలిసాం. పార్టీ తరఫున, సీఎల్పీ తరఫున సీఎస్ కు లేఖ ఇచ్చామని అన్నారు. అత్యున్నత హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేస్తామని సిఎస్ హామీ ఇచ్చారు. ఏప్రిల్ 17 నుంచి హైకోర్టు తీర్పు ప్రకారం సంపత్ కుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి శాసనసభ్యులుగా కొనసాగుతారు. వారికి అందవలసిన అన్ని విభాగాల వసతులు, ప్రోటోకాల్స్ అమలు కావాలని అయన అన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ 

కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ శాసనసభ్యత్వాలను పునరుద్ధరించబడ్డాయి. ఆయన వారికి కల్పించి వసతుల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోక పోవడం శోచనీయమని అన్నారు. శాసనసభ్యత్వాలను రద్దు చేయడం. ప్రభుత్వ ఏకపక్ష ధోరణి తో తీసుకున్న నిర్ణయమని అయన అన్నారు. ఎమ్మెల్యేల విషయంలో కోర్టు తీర్పును అమలు చేయకపోతే కోర్టు ధిక్కరణ కింద పరిగణించాల్సి వస్తుందని అయన హెచ్చరించారు. 

Related Posts