ఆర్దరాత్రి ఎస్పీ పర్యటన
గుంటూరు
శాంతి భద్రతల పరిశీలన మరియు కర్ఫ్యూ నిబంధనల అమలు తీరు పరిశీలన లో భాగముగా రాత్రి సమయములో గుంటూరు పట్టణములో ఆరిఫ్ హఫీజ్ పర్యటించారు. పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్,పొన్నూరు రోడ్, ఆలీ నగర్,ప్రగతి నగర్,సుద్దపల్లి డొంక మొదలగు ప్రాంతాలలోని వీధులలో అయన కాలినడకన పర్యటించారు. వీధులలో పర్యటిస్తూ స్వయముగా వాహన తనిఖీలలో పాల్గొన్నారు. అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వారిపై,అనుమానిత వాహన దారులపై, వాహనాలకు సంబంధించి సరైన పత్రాలు లేని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. కర్ఫ్యూను పటిష్టంగా అమలు పరచాలని పోలీస్ అధికారులకు ఆదేశాలిచ్చారు. కర్ఫ్యూ సడలింపు సమయం దాటిన తరువాత కూడా హోటళ్లను, దుకాణాలను నిర్వహిస్తున్న వారిపై అయన ఆగ్రహం వ్యక్తం చేసారు. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్ అధికారులకు ఆదేశాలిచ్చారు. సుద్దపల్లి డొంకలోని ఓ వీధిలో పర్యటించి అక్కడి ప్రజలతో మాట్లాడారు. మీ ప్రాంతములో ఎటువంటి సమస్యలు ఉన్న వెంటనే పోలీస్ వారి దృష్టికి తీసుకురావాలని ఎస్పీ సూచించారు. అర్బన్ జిల్లా పరిధిలోసమస్యాత్మక,నిర్మానుష్య మరియు మారుమూల ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా రాత్రి సమయాలలో గస్తీని ముమ్మరం చేయాలని,జిల్లా పోలీస్ అధికారులకు
కమ్యూనికేషన్ సెట్ ద్వారా ఆదేశాలు జారీ చేసారు. ఈ పర్యటనలో అర్బన్ జిల్లా ఎస్బి సీఐ బాలసుబ్రహ్మణ్యం, పాత గుంటూరు పోలీస్ స్టేషన్ సీఐ వాసు, సిబ్బంది పాల్గొన్నారు.