రహదారి మధ్యలో కల్వర్టు కోతకు గురై భారీ గుంత
విశాఖపట్నం
మన్యం వ్యాప్తంగా ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని కొన్నిచోట్ల రహదారులు బాగా దెబ్బతిన్నాయి.అసలే అంతంత మాత్రంగా ఉన్న రహదారులు భారీ వర్షాలకు చాలాచోట్ల రహదారులు అధ్వానంగా తయారయ్యాయి.రహదారులపై నుంచి వరద నీరు ప్రవహించడంతో కోతకు గురై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి చెరువుల తలపిస్తున్నాయి.ఇందులో భాగంగా కొల్లాపూటు పంచాయితీ బిట్రగండ,బలియాగుడ గ్రామాలకు వెళ్లే రహదారి మధ్యలో కల్వర్టు కోతకు గురై భారీ రంధ్రం ఏర్పడింది.ఈ రహదారి గుండనే ఈ రెండు గ్రామాల విద్యార్థులు నడుచుకుంటూ నందివలసలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో విద్య అభ్యసిస్తున్నారు.ఏమాత్రం పట్టు విడిచిన ప్రమాదం తప్పదు.అధికారులు వెంటనే స్పందించి రహదారి కల్వర్టు మరమ్మతు పనులు చేపట్టాలని ఏం.రామ్మూర్తి,వార్డ్ మెంబర్ బి.సుందర్ రెండు గ్రామాల గ్రామస్తులు కోరుతున్నారు.