వైద్య ఆరోగ్య శాఖపై సీఎం వైయస్.జగన్ సమీక్ష
అమరావతి
జిల్లాకేంద్రాలు, కార్పొరేషన్లలో హెల్త్హబ్స్పై సీఎం జగన్ మోహన్ రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. అధికారులు హెల్త్ హబ్స్ ఏర్పాటు విధివిధానాలపై సీఎంకు వివరాలు అందించారు. ఏయే జిల్లాల్లో ఏ తరహా ప్రత్యేక వైద్య చికిత్సలు అవసరమో గణాంకాలతో వివరాలు అందించారు. వైద్యంకోసం ఇతర రాష్ట్రాలకు వెళ్తున్న వైద్య చికిత్సల వివరాలనూ అందించారు. సీఎం మాట్లాడుతూ హెల్త్హబ్స్ద్వారా ఏర్పాటయ్యే ఆస్పత్రుల్లో కనీసం యాభైశాతం బెడ్లను ఆరోగ్యశ్రీ పేషెంట్లకు ఇవ్వాలని స్పష్టం చేసారు. ఆరోగ్య బీమా కంపెనీలు చెల్లిస్తున్న ఛార్జీలతో పోలిస్తే ఆరోగ్యశ్రీ కింద చెల్లిస్తున్న ఛార్జీలు మెరుగ్గానే ఉన్నాయన్నారు. ఎవరు ఎక్కువ బెడ్లను ఆరోగ్యశ్రీకి కేటాయిస్తే వారికి హెల్త్హబ్స్లో ప్రాధాన్యత ఇచ్చేలా చూడాలన్నారు. మన రాష్ట్రానికి చెందిన డాక్టర్లు కూడా ఇక్కడే స్థిరపడి మంచి వైద్య సేవలు అందించే ఉద్దేశం కూడా హెల్త్హబ్స్ ద్వారా నెరవేరుతుందన్నారు.