YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మృతి చెందిన ఖాతాదారునికి యూనియన్ బ్యాంక్ ఔదార్యం 

మృతి చెందిన ఖాతాదారునికి యూనియన్ బ్యాంక్ ఔదార్యం 

మృతి చెందిన ఖాతాదారునికి యూనియన్ బ్యాంక్ ఔదార్యం 
బేతంచెర్ల
 ఖాతాదారుల శ్రేయస్సే యూనియన్ బ్యాంక్ లక్ష్యమని మేనేజర్ బి.నాగమేల్లేశ్వరుడు మంగళవారం తెలిపారు.ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన తగరీష్ రవికుమార్ తమ బ్యాంకు నందు హౌసింగ్ లోన్ కలిగి ఉన్నాడని, లోన్ సమయంలో ఇండియన్ ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా భీమా చేశామని, సదరు వ్యక్తి మరణించడంతో,కుటుంబానికి ఆసరానిచ్చేందుకు ఇన్సూరెన్స్ కంపెనీ ఏరియా మేనేజర్ శరత్ కుమార్ ద్వారా  రూ.14,90,707/- లను మృతి చెందిన టి.రవి కుమార్ భార్య వసంత కు చెక్కు అందజేశారు.ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కుటుంబానికి ఆసరా భీమానేనని, భీమా ద్వారా బాధిత కుటుంబాలకు రుణ భారం తగ్గించడమే కాక, వారి భవిష్యత్ కు భారసానిచ్చినవారౌతారని, మేనేజర్ తెలిపారు. ఇటువంటి సదవకాశాన్ని ఖాతాదారులు సద్వినియోగం చేసుకొని భీమాయే ధీమా అనే నమ్మకాన్ని కలిగి ఉండాలని తెలిపారు.చెక్కును అందించిన వారిలో ఇన్సూరెన్స్ కంపెనీ సిబ్బంది లింగేశ్వర రెడ్డి, బ్యాంక్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Related Posts