సత్వర వ్యాక్సినేషన్‌తో కరోనా వైరస్‌కు చెక్!
న్యూఢిల్లీ సెప్టెంబర్ 14
డెల్టా వేరియంట్ సహా అన్ని కరోనా స్ట్రెయిన్ల నుంచి తీవ్ర లక్షణాలతో ఆస్పత్రుల పాలవకుండా కొవిడ్-19 వ్యాక్సిన్లు మెరుగైన రక్షణ కల్పిస్తున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ దశలో సాధారణ ప్రజలకు బూస్టర్ డోస్‌లు అవసరం లేదని ది లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనంలో అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం రివ్యూ నివేదిక వెల్లడించింది.బూస్టర్ డోస్‌ల కంటే ముందు వ్యాక్సినేషన్‌కు ఇప్పటికీ దూరంగా ఉన్న వారిని కాపాడేందుకు టీకాల కార్యక్రమం ముమ్మరంగా చేపట్టడం మేలని స్పష్టం చేసింది. వ్యాక్సిన్ల సామర్ధ్యంపై ఇప్పటివరకూ జరిగిన ట్రయల్స్ పలితాలు, జర్నల్స్, ప్రీప్రింట్ సర్వర్వ్ లో ప్రచురితమైన అధ్యయన ఫలితాలను డబ్ల్యూహెచ్ఓ, ఎఫ్‌డీఏ అధికారుల బృందం మదింపు చేస్తూ తాజా పరిశోధన చేపట్టింది. డెల్టా, ఆల్ఫా వేరియంట్ల నుంచి తీవ్ర కరోనా లక్షణాలు సోకకుండా వ్యాక్సినేషన్ ప్రజలకు 95 శాతం సగటు సామర్ధ్యం కనబరుస్తోందని తాజా ఫలితాలు వెల్లడించాయని పరిశోధకులు పేర్కొన్నారు.ఈ వేరియంట్ల నుంచి ఇన్ఫెక్షన్ బారినపడకుండా వ్యాక్సిన్లు 80 శాతం పైగా సామర్ధ్యం కలిగిఉన్నాయని వెల్లడించారు. అన్ని రకాల వ్యాక్సిన్లు, పలు రకాల వేరియంట్ల నుంచి ప్రజలు తీవ్ర అనారోగ్యం బారినపడకుండా మెరుగ్గా రక్షణ కల్పిస్తున్నాయని అధ్యయంన సంతృప్తి వ్యక్తం చేసింది.