YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

యూపీలో ప్రియాంక పోటీ

యూపీలో ప్రియాంక పోటీ

లక్నో, సెప్టెంబర్ 15, 
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. అన్ని పార్టీలూ ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నాయి. బీజేపీ తన స్ట్రాటజీని మార్చి మరోసారి యూపీని సొంతం చేసుకునే ప్రయత్నంలో ఉంది. సమాజ్ వాదీ పార్టీకి కూడా ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకే. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ సయితం ఉత్తర్ ప్రదేశ్ లో పూర్వ వైభవాన్ని సాధించాలన్న పట్టుదలతో ఉంది. పోయిన చోటే వెతుక్కోవాలన్న చందంగా యూపీలో పట్టు సాధిస్తే ఢిల్లీ పీఠం దక్కినట్లేనని చెప్పాలి.ఉత్తర్ ప్రదేశ్ లో 403 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అధికారంలోకి వచ్చే సంగతి ఎలా ఉన్నా ఫలితాల్లో క్రియాశీలకంగా మారాలన్న ప్రయత్నం కాంగ్రెస్ ప్రారంభించిందనే చెప్పాలి. గత లోక్ సభ ఎన్నికల్లో అమేధీలో రాహుల్ గాంధీ ఓటమి పాలు కావడంతో క్యాడర్ మొత్తం నిరుత్సాహంలోకి వెళ్లింది. రాహుల్ కే ఓటమి ఎదురైతే తమ పరిస్థితి ఏంటని కాంగ్రెస్ నేతలు మదన పడుతున్న సమయంలో ఆ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.ప్రియాంక గాంధీని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని పార్టీ నాయకత్వం సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చింది. దీనివల్ల పార్టీకి ప్లస్ లు తప్ప మైనస్ లు ఉండవని భావిస్తుంది. ప్రియాంక గాంధీని ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ప్రియాంక గాంధీ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో తలపడపోతున్నారు. గాంధీ కుటుంబానికి ఉత్తర్ ప్రదేశ్ లో పట్టు ఏంటో చూపించాలన్న ఉద్దేశ్యంతో ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు.ఇప్పటికే ప్రియాంక గాంధీ ఉత్తర్ ప్రదేశ్ బాధ్యతలను చూస్తున్నారు. పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాల వారీగా పర్యటిస్తూ బాధ్యులను నియమిస్తున్నారు. స్వయంగా ప్రియాంక గాంధీని ఎన్నికల్లో పోటీ చేయించడమే కాకుండా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి క్యాడర్ కు బలమైన సంకేతాలు పంపాలన్నది ప్రియాంక గాంధీ ఆలోచనగా ఉంది. పన్నెండు వేల కిలోమీటర్ల మేర యాత్ర చేయాలని కూడా కాంగ్రెస్ భావిస్తుంది. అయితే ప్రియాంక గాంధీ ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారన్నది ఆసక్తికరంగా మారింది. దీనిపై త్వరలో నిర్ణయం వెలువడే అవకాశముంది.

Related Posts