హైదరాబాద్
నటి ముమైత్ ఖాన్ బుధవారం డ్రగ్స్ కేసు దర్యాప్తు చేస్తున్న ఈడీ బృందం ముందు హజరయ్యారు. ముంబై నుండి శంషాబాద్ విమానాశ్రయానికి అక్కడి నుండి ఈడీ ఆఫీస్ కి చేరుకున్నారు. కేసులో ప్రధాన నిందితుడు కెల్వీన్ కు ముమైత్ ఖాన్ కు ఉన్న సంబంధాలపై ఆరా ఈడీ తీసినట్లు సమాచారం. ముమైత్ నుండి పెద్ద మొత్తంలో డబ్బులు కెల్విన్ కి బదిలీ అయినట్లు గుర్తించారు. 2015 నుండి లేటెస్ట్ బ్యాంక్ అకౌంట్స్ పత్రాలతో విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులుఆదేశించారు. ముమైత్ ఖాన్ కెల్విన్ నుండి విఫరీతంగా డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు అనుమానిస్తున్నారు. 2017 లో 10 గంటల పాటు ముమైత్ ను ఎక్సైజ్ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. అప్పట్లో బిగ్ బాస్ షో లో ఉన్న ముమైత్ పర్మిషన్ తో ఎక్సైజ్ విచారణకు హాజరు అయ్యారు.