చిత్తూరు
బి.కొత్తకోట లో ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడి జరిగింది. స్థానిక ఇందిరమ్మ కాలనీ లో ఘటన వెలుగు చూసింది. అనిల్ (20) అనే యువకుడు ఈ దారుణానికి ఒడిగట్టాడని గుర్తించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చిన్నారులను మిద్దెపైకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధిత చిన్నారులు బి.కొత్తకోట ఇందిరమ్మ కాలనీలో అమ్మమ్మ వద్ద ఉంటున్నారు. చిన్నారులు కేకలు వేయడంతో స్థానికులు గుర్తించి యువకుడిని పట్టుకుని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేసారు. నిందితుడు గత కొద్దిరోజులుగా కాలనీలో చిన్నారులను వేధిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు బి.కొత్తకోట పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.