YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

సుప్రీం మెట్లక్కిన అభిశంసన తీర్మానం

 సుప్రీం మెట్లక్కిన అభిశంసన తీర్మానం

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అభిశంసన వ్యవహారం రసవత్తరంగా మారింది. రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్య నాయుడు సీజేఐపై అభిశంసన తీర్మానం నోటీసులను తిరస్కరించడాన్ని కాంగ్రెస్‌ పార్టీ సవాలు చేసింది. ఆ పార్టీ రాజ్యసభ ఎంపీలు ప్రతాప్‌ సింగ్‌ భజ్వా (పంజాబ్), అమీ హర్షద్‌రే యాజ్నిక్‌ (గుజరాత్) సోమవారం (మే 7) వెంకయ్యనాయుడు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో ఓ పిటిషన్‌ దాఖలుచేశారు. రాజ్యసభ ఛైర్మన్ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించలేదని, ఈ అంశంపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని వారు పిటిషన్‌లో కోరారు. దీంతో తన ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన తీర్మానానికి సంబంధించి సుప్రీంకోర్లు కీలక తీర్పు వెలువరించాల్సిన అరుదైన సందర్భం వచ్చింది. సీజేఐపై అభిశంసన తీర్మానం కోరుతూ 7 పార్టీలకు చెందిన 60 మంది ఎంపీల సంతకాలు చేసిన నోటీసును గత నెలలో రాజ్యసభ ఛైర్మన్‌కు సమర్పించారు. ధర్మాసనాల ఏర్పాటు, కేసుల కేటాయింపులు, రోస్టర్‌ విధానం తదితర అంశాల్లో సీజేఐ దీపక్‌ మిశ్రా తీరును నిరసిస్తూ తొలిసారిగా నలుగురు సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తులు మీడియా సమావేశం నిర్వహించిన అనంతరం ఈ వ్యవహారం రాజకీయ మలుపు తిరిగింది. దీంతో సీజేఐపై కాంగ్రెస్ పార్టీ అభిశంసన తీర్మానం పెట్టడానికి పూనుకుంది. కానీ, రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్య నాయుడు ఈ నోటీసులను తిరస్కరించడంతో ఆ పార్టీకి ఆదిలోనే చుక్కెదురైంది.సీజేఐపై అభిశంసన విషయంలో కాంగ్రెస్ పార్టీ తాజాగా భారత సర్వోన్నత న్యాయస్థానం మెట్లెక్కడంతో ఈ అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. సీజేఐపై అభిశంసన తీర్మానం కోరుతూ విపక్ష ఎంపీలు సంతకాలు చేసి ఇచ్చిన నోటీసును రాజ్యసభ చైర్మన్‌ పట్టించుకోలేదని, నిబంధనల ప్రకారం నోటీసులను తిరస్కరించే అధికారం వైస్ ఛైర్మన్ కుఉన్నా, సీజేఐపై వచ్చిన ఆరోపణలపై కనీసం దర్యాప్తు కమిటీనైనా ఏర్పాటు చేయాల్సి ఉందని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు. ఇక ఈ పిటిషన్‌పై భారత సర్వోన్నత న్యాయస్థానం ఎలా వ్యవహరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Related Posts