తిరుపతి
తిరుమల వెంకటేశ్వరస్వామితో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆడుకుంటున్నాడని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. బుధవారం అయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. జంబో పాలకమండలి నిర్ణయం సరైంది కాదు. పాలకమండలి సభ్యుల నియామకంపై సిఎం పునరాలోచన చేయాలి. పాలకమండలి సభ్యుల సంఖ్యను పెంచితే న్యాయం పోరాటం చేస్తామని అన్నారు. క్రిస్టియన్ ఛారిటీస్ మీద నీ పెత్తనం చూపించగలవా అంటూ జగన్ కు సూటి ప్రశ్న వేసారు.. వైసిపినే తోకపార్టీ. వైసిపి మంత్రులు నోరుజారితే తోకలు కత్తిరిస్తాం. మంత్రి సీదిరిఅప్పలరాజుకు మత్స్య శాఖ బడ్జెట్ ఎంతో తెలుసా అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు సేవా సమర్పణ అభయాన్ కరపత్రాలను విడుదల చేసారు. ఈనెల 17వతేదీన ఉచిత వ్యాక్సిన్ కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఈనెల 18వతేదీన నిరుపేదలకు ఉచిత రేషన్ పంపిణీ వుంటుంది. ఈనెల 17వతేదీ నుంచి అక్టోబర్ 7వతేదీ వరకు బిజెపి సాధించిన విజయాలు, ప్రజలకు చేసిన సేవలను వివరిస్తూ పలు కార్యక్రమాలను నిర్వహిస్తాంసేవా సమర్పణ అభయాన్ కరపత్రాలను విడుదల చేసారు.