టీడీపీ రైతుల నిరసన
నర్సాపురం
రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలో తెలుగుదేశం నేతలు నిరసన తెలిపారు. గోదావరి జిల్లాల లో పలు ప్రాంతాల్లో పంట విరామం, ఆక్వా రైతులు సమస్యలు, ఇన్పుట్ సబ్సిడీ, పంట నష్టం పరిహారం,అందక పోవడం తదితర అంశాలపై ఆందోళన చేశారు, పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ నుండి ఇ అంబేద్కర్ సెంటర్ మీదుగా సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు ఎడ్లబండిపై ర్యాలీ నిర్వహించారు అనంతరం సబ్ కలెక్టర్ విష్ణు చరణ్ కు వినతిపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో నరసాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి పుత్తూరు రామరాజు, కొవ్వలి నాయుడు, నరసాపురం పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు పసుపులేటి రత్నమాల, మరియు తెలుగుదేశం నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.