తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంపై కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని రాయలసీమ పోరాట సమితి మండిపడింది. టీటీడీలోని ఐఏఎస్ అధికారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఏజెంట్లుగా పని చేస్తున్నారని పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి ఆరోపించారు. వీరి నిర్వాకం వల్లే శ్రీవారి సొమ్ము, ఆస్తులపై కేంద్ర పురావస్తు శాఖ కన్ను పడిందని అన్నారు.టీటీడీ ఈవోకు కేంద్ర పురావస్తు శాఖ లేఖ రాయడం, ఆ తర్వాత వెంటనే ఉపసంహరించుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. ఈ కుట్ర వెనుక బీజేపీ, ఆరెస్సెస్ ల హస్తం ఉందని తెలిపారు. తిరుమల కొండపైన ఏ పురాతన కట్టడాన్నైనా తొలగించాలన్నా, కొత్త నిర్మాణాన్ని చేపట్టాలన్నా ఆగమ సలహామండలి సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని...కానీ, వారి సూచనలను టీటీడీ అధికారులు పట్టించుకోకపోవడంతో... ఆలయ ప్రతిష్ట మసకబారుతోందని విమర్శించారు.