YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కౌన్సిలింగ్ కు హాజరయిన విద్యార్ధులకు హాస్టల్ సదుపాయం 100 శాతం రాయితి

ఎస్ఆర్ఎం యూనివర్సిటీ  కౌన్సిలింగ్ కు హాజరయిన      విద్యార్ధులకు హాస్టల్ సదుపాయం 100 శాతం రాయితి

ప్రముఖ విద్యా సంస్థ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ  బిటెక్ ప్రథమ సంవత్సరం కౌన్సిలింగ్ ను ఈ నెల 7 వ తేది నుండి 11 తేది వరకు హరియానా ,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో నిర్వహిస్తున్నట్లు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రెసిడెంట్  డాక్టర్.పి సత్యనారాయణన్ తెలియజేసారు ఈ నెల 11 నుండి 20 వరకు చెన్నయ్ కాంపస్ లో కౌన్సిలింగ్ జరుగుతుందని చెప్పారు. గతనెల 16 నుండి 30 వరకు  దేశం లోని వివిధ ప్రాంతాలలో బిటెక్ ప్రవేశాలకు అర్హత పరిక్షలు  నిర్వహించమని ఈ నెల 1వ తేదిన పలితాలు వెల్ల దెంచామని ఆయన  తెలిపారు.దేశం లోని 7 రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు మొదటి 10  రాంకులు  వచ్చాయని  ఆయన వివరించారు. దేశ వ్యాప్తంగా గల ఎస్ఆర్ఎం గ్రూప్  సంస్థల్లో చదువుతున్న  విద్యార్థులకు 30 కోట్ల రూపాయల స్కాలర్ షిప్ లు అందజేస్తున్నామని  తెలిపారు. మొదటిరోజు కౌన్సిలింగ్ కు హాజరయిన తొలి 100 రాంకుల విద్యార్ధులకు హాస్టల్  సదుపాయం తో సహా 100 శాతం రాయితి ఉంటుందని, 101 నుండి 500 ర్యాంకు గల విద్యార్థులకు టుషన్ ఫీజు 100 శతం రాయితి ఉంటుందని 501 నుండి 1000 రాకు తెచ్చు కున్న విద్యార్తులకు  75 శాతం రాయితి, 1001 నుండి2000 వరకు, రాంకులు తెచ్చుకున్న  విద్యార్థులకు 50 శాతం రాయితి ,2001 నుండి 3000 ర్యాంకు తెచ్చుకున్న  విద్యార్తులకు 25 శాతం రాయితి ఉంటుందని  ఆయన తెలిపారు. లక్షా 72 ,825 మంది విద్య్కర్థులు ప్రవేశ పరీక్షకు రిజిస్టర్ చేసుకోగా 76 వేల మంది విద్యార్థులను  కౌన్సిలింగ్ కు పిలిచామని ,దేశ వ్యప్తంగా 123 సెంటర్లలో ప్రవేశ పరీక్షలు నిర్వహించమని ఆయన తెలిపారు.10 వేల మంది టాప్  ర్యాంకర్ లలో 66 శతం సిబిఎస్ఇ విద్యార్థులను ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ,డిల్లి ,రాజస్తాన్, ఆంధ్ర ప్రదేశ్, పచ్చిమ బెంగాల్ తెలంగాణా, హరియానా, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు  అత్యుత్తమ ర్యాంకు లు సాధించారని  సత్య నారాయణన్  వివరించారు.

Related Posts