YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

దూసుకెళుతున్న అదీప్ రాజా

దూసుకెళుతున్న అదీప్ రాజా

విశాఖపట్టణం, సెప్టెంబర్ 16, 
వైసీపీలో చాలా మంది యువ ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే అందరూ రాజకీయంగా వారు ఎవరూ పెద్దగా రాటుదేలలేకపోతున్నారు. ఉన్న వారిలో దూకుడు చూపించిన వారే జనాల మన్ననలను అందుకుంటున్నారు. వారే రేపటి రోజున మళ్ళీ మళ్ళీ గెలిచేందుకు కూడా బాటలు వేసుకుంటున్నారు ఆ విధంగా ఆలోచిస్తే విశాఖ జిల్లా పెందుర్తికి చెందిన వైసీపీ యువ ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదీప్ రాజ్ మంచి జోరు చూపిస్తున్నారు. ఆయన స్పీడ్ ని అందుకోవడంలో టీడీపీ దాదాపుగా చతికిలపడింది అనే చెప్పాలి. అస‌లు పెందుర్తి టిక్కెట్ కోసం చాలా మంది త‌ల‌పండిన నేత‌లు పోటీ ప‌డ్డారు. అయితే జ‌గ‌న్ చేయించిన ప‌లు స‌ర్వేల్లో అదీప్‌రాజ్ అయితేనే క‌రెక్ట్ అని తేల‌డంతో నేరుగా ఆయ‌న‌కే టిక్కెట్ ఇచ్చారు.అదీప్ రాజ్ కు వైసీపీ హై కమాండ్‌లో అంద‌రు పెద్దల అండదండలు ఉన్నాయి. దాంతో తన నియోజకవర్గానికి అవసరమైనవి అన్నీ ఆయన కోరి మరీ తెప్పించుకుంటున్నారు. పేదలకు ఇళ్ళ స్కీం లో ఆయన పెద్ద ఎత్తున తన నియోజకవర్గానికి ఇళ్ళను తెప్పించుకున్నారు. దాదాపుగా ముప్పై వేల ఇళ్ళను ఆయన పెందుర్తిలో లబ్దిదారుల కోసం ప్రభుత్వం తరఫున కట్టిస్తున్నారు. దీంతో పాటు సంక్షేమ పధకాలు కూడా అర్హులైన అందరికీ దక్కేలా చర్యలు తీసుకుంటున్నారు. అదే విధంగా సుడిగాలి పర్యటలను చేస్తూ ప్రజలతో ఎప్పటికపుడు అదీప్ రాజ్ టచ్ లో ఉంటున్నారు.ఈ మధ్యనే అదీప్ రాజ్ తన సతీమణిని కూడా పెందుర్తి సర్పంచ్ గా గెలిపించుకుని సత్తా చాటారు. ఆయన మీద విమర్శలు చేస్తూ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, ఆయన కుమారుడు బండారు అప్పలనాయుడు జోరు చేస్తున్నా కూడా కూడా అదీప్ రాజ్ కూడా ధీటుగానే తిప్పి కొడుతున్నారు. మీ హయాంలో ఒక్క ఇళ్ళూ ఇవ్వలేని వారు విమర్శలు చేయడమేంటని సైకిలి పార్టీ గాలి తీసేస్తున్నారు. పాలన అంటే వైసీపీ వచ్చాకనే జనాలకు తెలిసింది అంటున్నారు. తన కొడుకు వయసుతో సమానం అయిన అదీప్ రాజ్ మీద నేరుగా విమర్శలు చేయడానికి బండారు జంకుతున్నారు.మ‌రోవైపు బండారుకు వ‌య‌స్సు అయిపోవ‌డంతో ఆయ‌న రాజ‌కీయానికి పెందుర్తిలో నూక‌లు చెల్లిన ప‌రిస్థితే క‌నిపిస్తోంది. ఇక బండారు త‌న‌యుడు అప్పల‌నాయుడిపై ప్రజ‌ల్లోనే కాకుండా.. సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేక‌త ఉంది. ఇక అప్పలనాయుడుని అదీప్ రాజ్ అసలు పట్టించుకోవడంలేదు. దీంతో ఈ యువ ఎమ్మెల్యే దూకుడు ముందు టీడీపీ వీగిపోతోంది అనే చెప్పాలి. మరో సారి గెలిచేందుకు సరైన ప్రణాళికను సిద్ధం చేసుకుని ముందుకు పోతున్న అదీప్ రాజ్ ని కట్టడి చేయడం మాత్రం ఈ టీడీపీ తండ్రి కొడుకుల‌ తరం కావడం లేదనే అంటున్నారు

Related Posts