YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

మెజార్టీపైనే మమత దిగులు

మెజార్టీపైనే మమత దిగులు

కోల్ కత్తా, సెప్టెంబర్ 16, 
మమత బెనర్జీకి బెదురులేదు. భయం అసలే లేదు. ఆమె కు ఉన్న అస్సెట్ అదే. రాజకీయాల్లో అదే కావాలి. ప్రత్యర్థులను చూసి భయపడితే సగం జయం మాయమయినట్లే. మమత బెనర్జీకి ఇది తెలియంది కాదు. అందుకే మమత బెనర్జీ పశ్చిమ బెంగాల్ లో హ్యాట్రిక్ విజయం సాధించగలిగారు. అంటే పదిహేనేళ్ల పాటు మమత బెనర్జీ పశ్చిమ బెంగాల్ ను పాలించే అవకాశం దక్కింది. అయితే ఆమె గత ఎన్నికల్లో ఓటమి పాలవ్వడం కొంత ఇబ్బంది కరమైన అంశమే.రాజకీయంగా పట్టు ఉండటం, పార్టీపై గ్రిప్ తో మమత బెనర్జీ ఎమ్మెల్యేగా ఎన్నిక కాకపోయినా ముఖ్యమంత్రిగా ఈ ఏడాది మే 4వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. ఆరు నెలల్లో మమత బెనర్జీ ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంది. శాసన మండలి కూడా లేకపోవడంతో మమత బెనర్జీ ఉప ఎన్నికలపై నే ఆశలు పెట్టుకున్నారు. ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ను విడుదల చేసింది. పశ్చిమ బెంగాల్ లో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 30వ తేదీన ఉప ఎన్నికలు జరగనున్నాయి.మమత బెనర్జీ తిరిగి భవానీపూర్ నుంచే బరిలోకి దిగుతున్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో తనను ఆదరించిన, గెలిపిస్తున్న భవానీపూర్ ను కాదని మమత బెనర్జీ నందిగ్రామ్ కు వెళ్లారు. భవానీపూర్ లో తృణమూల్ కాంగ్రెస్ గెలిచింది. నందిగ్రామ్ లో మాత్రం మమత ఓడిపాయారు. దీంతో మమత బెనర్జీ గెలిచేందుకు భవానీపూర్ లో గెలిచిన ఎమ్మెల్యే రాజీనామా చేయడంతో తిరిగి ఉప ఎన్నిక అనివార్యమయింది.భవానీపూర్ లో మమత బెనర్జీ గెలుపుపై పెద్ద అనుమానాలు లేకపోయినా ముందు జాగ్రత్త చర్యలు అన్ని తీసుకుంటున్నారు. ఇప్పటికే భవానీపూర్ నియోజకవర్గంలో గ్రామాల వారీగా బాధ్యులను నియమించారు. తన గెలుపు కంటే మమత బెనర్జీ మెజారిటీపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. అత్యధిక మెజారిటీ రావాలని మమత బెనర్జీ నేతలను ఆదేశించారు. మొత్తం మీద మమత బెనర్జీ దిగులంతా గెలుపుపై కాదట… మెజారిటీపైనేనట.
పోటీకి కాంగ్రెస్ దూరం
బెంగాల్‌లోని భ‌వానీ పూర్ నియోజ‌కవ‌ర్గానికి ఈనెల 30 వ తేదీన ఉప ఎన్నిక జ‌ర‌గ‌బోతున్న‌ది.  ఈ ఉప ఎన్నిక‌ల్లో తృణ‌మూల్ కాంగ్రెస్ నుంచి ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ బ‌రిలో ఉండ‌గా, బీజేపీ నుంచి ప్రియాంక పోటీ చేస్తున్నారు.  ఇక సీపీఐ నుంచి శ్రీజివ్ బిశ్వాస్ బ‌రిలో ఉన్నారు.  నందిగ్రామ్ నుంచి ఓడిపోయిన మ‌మ‌తా బెన‌ర్జీ త‌న సొంత నియోజ‌క వ‌ర్గం భ‌వానీపూర్ నుంచి బ‌రిలో దిగారు.  అమె విజ‌యం న‌ల్లేరుపై న‌డ‌కే అని చెప్పొచ్చు.  అయిన్ప‌టికి బీజేపీ పోటీలో ఉన్న‌ది.  భ‌వానీపూర్‌లో ముస్లీంలు అధికంగ ఉంటారు.  అలానే, హిందువులు, సిక్కులు, జైనులు ఇత‌ర మ‌త‌స్తులు భ‌వానీపూర్ ప్రాంతంలో నివ‌శిస్తుంటారు.  అయితే, ఈసారి కాంగ్రెస్ పార్టీ ఈ ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డంలేదు.  దీంతో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ తృణ‌మూల్ కాంగ్రెస్‌కు బ‌దిలీ అయ్యే అవ‌కాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.  ఇక‌, రైతు ఉద్య‌మాల నేప‌థ్యంలో పంజాబీ సిక్కులు బీజేపీకి వ్య‌తిరేకంగా ఓటు వేసే అవ‌కాశం ఉన్న‌ది.  దేశంలో బీజేపీని ఓడించేందుకు అన్ని పార్టీలను ఏకం చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్న సంగ‌తి తెలిసిందే.  ఇటీవ‌లే ఆమె ఢిల్లీలో అనేక మంది నేత‌ల‌ను క‌లిశారు.  కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో కూడా భేటీ అయ్యారు.  క‌లిసి ప‌నిచేసేందుకు ఇరు నేత‌లు అంగీకారానికి కూడా వ‌చ్చారు.  ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ భ‌వానీపూర్ నియోజ‌కవ‌ర్గం నుంచి పోటీ చేయ‌డంలేద‌ని చెప్పుకోవ‌చ్చు.  

Related Posts