YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

బండి వర్సెస్ కేటీఆర్

బండి వర్సెస్ కేటీఆర్

హైదరాబాద్, సెప్టెంబర్ 16,
తెలంగాణలో మంత్రి కే‌టి‌ఆర్..బి‌జే‌పి నేతల మధ్య సవాళ్ళ పర్వం నడుస్తోంది. ఇప్పటికే పాదయాత్రతో దూసుకెళుతున్న రాష్ట్ర బి‌జే‌పి అధ్యక్షుడు బండి సంజయ్ టి‌ఆర్‌ఎస్ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే సొమ్ము కేంద్రానిది…సోకు రాష్ట్రానిది అంటూ బండి ఫైర్ అయ్యారు. అయితే బండి కామెంట్లకు మంత్రి కే‌టి‌ఆర్ సైతం కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏడేళ్లలో కేంద్రానికి రూ. 2.72 లక్షల కోట్ల పన్నులు కడితే రాష్ట్రానికి 1.42 లక్షల కోట్లే తిరిగిచ్చారని, ఈ మాటలు అబద్ధమైతే తాను రాజీనామా చేస్తానని, నిజమైతే బండి రాజీనామా చేయాలని కే‌టి‌ఆర్ సవాల్ విసిరారు. ఇక కే‌టి‌ఆర్ సవాల్‌కు బి‌జే‌పి నేతలు వెంటవెంటనే కౌంటర్లు ఇచ్చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం రాజ్యాంగంలో సూచించిన విధంగానే రాష్ట్రాలకు కేటాయించడం జరుగుతుందని, అలాగే తెలంగాణకు నిధులు కేటాయిస్తున్నారని, తాను చెప్పిన విషయంలో తప్పుంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, నిజమైతే మంత్రి కేటీఆర్‌ తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్దమా అంటూ బి‌జే‌పి ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్ విసిరారు.అటు రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వలేదని అసెంబ్లీలో చర్చ పెట్టాలని,  ఆ దమ్ము టీఆర్ఎస్‌కు ఉందా అని బీజేపీ నేత మురళీధర్ రావు సవాల్ విసిరారు. ఇలా కే‌టి‌ఆర్‌ని వరుసపెట్టి బి‌జే‌పి నేతలు రౌండప్ చేశారు. అయితే ప్రజల సొమ్ముతో నడుస్తున్న ప్రభుత్వాలు…వారి సొంత సొమ్ములాగా ఫీల్ అయ్యి సవాళ్ళు విసురుకోవడం వింతగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.అసలు ప్రజల నుంచి ట్యాక్సుల రూపంలో డబ్బులు వసూలు చేస్తున్న రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు..నిధులు విషయంలో అనవసరమైన సవాళ్ళు విసురుకుంటున్నారని అంటున్నారు. అయినా బి‌జే‌పి పాలిత రాష్ట్రాలకు కేంద్రం ఎక్కువ నిధులు ఇస్తుందని, మిగిలిన రాష్ట్రాలకు తూతూ మంత్రంగా నిధులు మంజూరు చేస్తుందని చెబుతున్నారు. ఏదేమైనా ప్రజల సొమ్ముపై నేతలు సవాళ్ళు విసురుకోవడం విడ్డూరంగా ఉందని అంటున్నారు.

Related Posts