పార్కింగ్ ప్రదేశాల వివరాలు వెల్లడించిన పోలీసులు
రిపబ్లిక్ డే సందర్భంగా పోలీసులు పరేడ్ గ్రౌండ్‌తో పాటు రాజ్‌భవన్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు, పార్కింగ్ ఏర్పాట్ల వివరాలను వెల్లడించారు. జనవరి 26న ఉదయం 9గంటలకు సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో జరగనున్న గణతంత్ర వేడుకల సందర్భంగా ఆయా పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సిటీ పోలీస్ ఇంచార్జ్ కమిషనర్ వీవీ శ్రీనివాసరావు ప్రకటించారు. అదే రోజు సాయంత్రం రాజ్‌భవన్‌లో జరిగే కార్యక్రమం సందర్భంగా పార్కింగ్ వివరాలు వెల్లడించారు.
ఉదయం 8 నుంచి 12 గంటల మధ్య స్వీకార్, ఉప్‌కార్ జంక్షన్ నుంచి ఎస్‌బిహెచ్ క్రాస్ రోడ్ వరకు ఇతర వాహనాలకు అనుమతి లేదు. ఎస్‌పీ రోడ్డు నుంచి సాధారణ ప్రజానీకాన్ని అనుమతించరు.
కార్ పాసులున్న వారికి ఎస్.పి.రోడ్‌లోని సెంట్రల్ టెలిగ్రాఫ్ క్రాస్‌రోడ్ నుంచి వైఎంసిఎ క్రాస్ రోడ్ వరకు వన్‌వేగా మార్చి అనుమతిస్తారు. వారు పరేడ్ ప్రారంభానికి ముందు... పూర్తయిన తర్వాత ఆ దారి గుండా తిరిగి వెళ్లాల్సి ఉంటుంది.
వాహనాలపై ఏఏ, ఏ-1, బి-1 పాసులున్న వారు బేగంపేట వైపు నుంచి వస్తే రసూల్‌పురా జంక్షన్, సీటీఓ ఫ్లైఓవర్ ద్వారా... వెళ్లాలి.
అవే పాసులున్న వారు అప్పర్ ట్యాంక్‌బండ్, రాణిగంజ్ వైపు నుంచి వస్తే వారు ఎంజిరోడ్, పార్క్‌లేన్‌ల ద్వారా సెంట్రల్ టెలిగ్రాఫ్ ఐలాండ్, ప్లాజా జంక్షన్ నుంచి పరేడ్‌గ్రౌండ్ వెళ్లాలి.
కంటోన్మెంట్ వైపు నుంచి సర్దార్‌పటేల్ రోడ్ వైపు వచ్చే వారు సికింద్రాబాద్ క్లబ్, టివోలిప్లాజా క్రాస్‌రోడ్స్ నుంచి ఎడమ వైపు మళ్లి అతిథులు దిగిన తర్వాత అక్కడే వాహనాలు పార్క్ చేయాలి.
ఏఏ పాసులున్న కార్లను ఎస్‌బీహెచ్ ఫ్లై ఓవర్ కింద వీఐపీ పార్కింగ్ ఏరియాలో పార్క్ చేయాలి.
ఏ-1 పాసులున్న కార్లను జీహెచ్‌ఎంసీ స్విమ్మింగ్‌పూల్ ఎదురుగా (ఫ్లైఓవర్ కింద) పార్క్ చేయాలి.
బి-1 పాసులున్న కార్లను ఎస్‌బీహెచ్ జంక్షన్ ఎడమ వైపున ఉన్న చీఫ్ ఇంజనీర్ కార్యాలయం కాంపౌండ్‌లో వాహనాలు పార్క్ చేయాలి.
ఏ-2 పాసులున్న వారు జింఖానా గ్రౌండ్స్‌లో వాహనాలు పార్క్ చేయాలి.
బి-2 పాసులున్న వారు చీఫ్ ఇంజనీర్ ఆఫీస్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వద్దనే అతిథులు దిగి నడుచుకుంటూ వెళ్లగా.. వాహనాలు ఆయా కార్యాలయాల కాంపౌండ్‌లో పార్క్ చేయాలి.
ఎలాంటి పాసులు లేని వారు ఆర్‌పి రోడ్ ద్వారా వచ్చి ఎస్‌బీహచ్ జంక్షన్ వద్ద రైట్ టర్న్ తీసుకుని వైఎంసిఏ వైపు వెళ్లాలి. వాహనాలను లాంబా థియేటర్ సమీపంలో ఉన్న సిద్ధాంతి కాలేజ్ లేన్‌లో పార్క్ చేయాలి.
పరేడ్ పూర్తయిన తర్వాత ఏఏ, ఏ-1, బి-1 కార్ పాసులున్న వారు ఎస్‌పిరోడ్, ప్లాజా జంక్షన్‌ల ద్వారా తిరిగి వెళ్లాలి.
ఏ-2 పాస్‌లున్న వారు టివోలి క్రాస్‌రోడ్స్ ద్వారా, బీ-2 కార్ పాసులున్న వారు ఎస్‌బిహెచ్ జంక్షన్ ద్వారా తిరిగి వెళ్లాల్సి ఉంటుంది.
అంబులెన్స్, ఫైర్ బ్రిగేడ్‌లు వేడుకల వేదిక వెనక అందుబాటులో ఉంటాయి.
పంజాగుట్ట, బేగంపేట్ ప్రాంతాల నుంచి వచ్చే ఏఏ, ఏ-1, బీ-1 పాస్‌లున్న వాహనదారులు ఉదయం 9.45 గంటల తర్వాత వస్తే...వారికి సూచించిన దారులు కాకుండా ప్రత్యామ్నాయ దారులైన చిల్లా దర్గా వద్ద మళ్లి రాంగ్‌సైడ్ ద్వారా స్విమ్మింగ్‌పూల్ వరకు వెళ్లాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు.
రాజ్‌భవన్ వద్ద..గణతంత్ర దినోత్సవం రోజు సాయంత్రం 5.30 గంటలకు రాజ్‌భవన్‌లో జరగనున్న వేడుకల సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలుంటాయని సీపీ తెలిపారు. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు మోనప్ప ఐలాండ్ నుంచి వీవీ విగ్రహం వరకు ఆంక్షలు ఉంటాయి.
వాహనాల పార్కింగ్ వివరాలు
పింక్ కలర్ కార్ పాస్‌లున్న వారికి గేట్ నెంబర్-1 ద్వారా లోపలికి అనుమతి ఉంటుంది. వారి వాహనాలను కూడా లోపలికి అనుమతించి రాజ్‌భవన్‌లోని పార్కింగ్‌లాట్‌లో పార్కింగ్ చేసే అవకాశముంటుంది.
తెల్ల కలర్ పాసులున్న వారు గేట్ నెంబర్-3 ద్వారా లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. వారి వాహనాలను రాజ్‌భవన్ పార్కింగ్ లాట్‌లతో పాటు ఎంఎంటిఎస్ పార్కింగ్‌లో, పార్క్ హోటల్ పార్కింగ్‌లో, కత్రియ లేన్‌లో, జయాగార్డెన్ ఫంక్షన్ హాల్‌లో, మెట్రో రెసిడెన్సీ నుంచి నాసర్ స్కూల్ వరకు సింగిల్ లేన్ పార్కింగ్, లేక్ వ్యూ నుంచి వీవీ విగ్రహం వరకు సింగిల్ లేన్ పార్కింగ్‌కు అనుమతి ఉంటుంది.