హైదరాబాద్
సంచలనం సృష్టించిన సింగరేఫి కాలనీ ఆరేళ్ల చిన్నారి హత్యాచారం కేసు నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం నిందితుడు రాజు మృతదేహాన్ని కనుగొన్నారు. రాజు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘట్కేసర్-వరంగల్ మధ్య స్టేషన్ ఘన్ పూర్ మండలంలోని రాజారాం వంతెన రేల్వే ట్రాక్పై రాజు మృతదేహం దొరికింది. మృతుడి చేతిపై మౌనిక అనే పేరుతో ఉన్న పచ్చబొట్టు టాటూ ఆధారంగా మృతుడు నిందితుడు రాజు అని గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.