విశాఖపట్నం
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రధాన ద్వారం వద్ద దీక్షలు చేపట్టిన కార్మిక సంఘాల నేతలకు సీపీఎం పొలిట్ బ్యురో సభ్యురాలు బృందా కారత్ సంఘీభావం తెలిపారు.నేటితో 216వ రోజుకు కార్మికుల రిలేనిరహార దీక్షలు చేరుకున్నాయి.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, చేస్తున్న పోరాటానికి మా పూర్తి మద్దతు ను తెలియజేస్తున్నామని,విశాఖ స్టీల్ ప్లాంట్ లో వేల మంది కార్మికుల కృషి ఉందని సీపీఎం పొలిట్ బ్యురో సభ్యురాలు బృందా కారత్ అన్నారు.మోదీకి విశాఖ స్టీల్ ప్లాంట్ యొక్క చరిత్ర, త్యాగాల గురించి తెలుసా అని ప్రశ్నించారు.అన్ని యూనియన్లు కలిసి చేస్తున్న పోరాటం కచ్చితంగా పలిస్తుందని,కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు దేశానికి వెన్నుముక అని అన్నారు.బిజెపి ప్రభుత్వం దేశాన్ని ప్రైవేటువ్యక్తులకు అమ్మాలి అనుకుంటుందని,విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రజల ఆస్తి అని,వ్యవసాయాన్ని కాపాడటానికి ఢిల్లీ లో రైతులు దీక్షలు చేపడుతున్నారని,మోదీ పుట్టిన రోజున విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం వ్యతిరేకంగా గ్రీటిగ్ కార్డులతో నిరసన తెలపాలని పిలుపునిచ్చారు.ఈ నెల 27 న దేశవ్యాప్త సమ్మె కు రైతులు సిద్ధం అవుతున్నారని అన్నారు.