YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

సైబరాబాద్ రాజు ఆత్మహత్య

సైబరాబాద్ రాజు ఆత్మహత్య

సైబరాబాద్ రాజు ఆత్మహత్య
హైదరాబాద్, సెప్టెంబర్ 16,
సైదాబాద్ రాజు ఎట్టకేలకు సూసైడ్ చేస్కున్నాడు. ఈ ఎనిమిది రోజుల్లో జరిగిన అతి ముఖ్యమైన ఎనిమిది ఘటనలు ఏవి? డేవన్ టూ డే లాస్ట్ అసలేం జరిగింది?సింగరేణి కాలనీ బాలిక హత్యాచార నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరేళ్ల పాపపై హత్యాచార కేసులో ఇతడు నిందితుడు. సెప్టెంబర్ 9న హైదరాబాద్, సైదాబాద్ కాలనీలో ఆరేళ్ల పాపపై అత్యాచారం చేశాడీ పాపాత్ముడు. ముప్పై ఏళ్ల రాజు ఆటోడ్రైవర్ గా పని చేశాడని చెబుతున్నారు స్థానికులు. అల్లరి చిల్లరగా తిరిగే.. జులాయిగా ఇతడికి పేరుంది. తన భార్యను కొట్టి ఇంటి నుంచి వెళ్లగొట్టాడని అంటున్నారు స్థానికులు. ఇపుడదే భార్య రాజు మరణానంతరం తీవ్రంగా ఏడవటం కనిపించింది.ఇలాంటి మెంటాలిటీ ఉన్న రాజు సెప్టెంబర్ 9వ తేదీన- మాదన్నపేటలో భవన నిర్మాణ పనులకు కూలీగా వెళ్లాడు. ఉదయం 9 గంటలకు పనికి వెళ్లి.. సాయంత్రం 4 గంటలకు తన గదికి తిరిగొచ్చాడు. సాయంత్రం నాలుగున్నర- 5 గంటల మధ్యలో చిన్నారికి మాయ మాటలు చెప్పి తన రూమ్‌కు తీసుకొచ్చాడు. రూమ్ లోనే చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె అరుస్తుంటే గొంతు నులిమి చంపేశాడు.తర్వాత గదికి తాళం వేసి బయటకు వచ్చాడు. ఆ తర్వాత తాగిన మైకంలో అదే ప్రాంతంలో తచ్చాడాడు. సాయంత్రం ఏడు గంటలకు అక్కడే ఉన్న పానీపూరీ బండి దగ్గర పానీపూరీ తిన్నాడు. అప్పటికే పాప కనిపించడం లేదంటూ.. సింగరేణి కాలనీ వాసులు వెతుకుతున్నారు. రాత్రి తొమ్మిది గంటలకు చిన్నారి నాయనమ్మ కనిపించగా.. ఆమెతో పాప కనిపించిందా? అని అడిగాడు. తాగిన మత్తులో రోడ్డుపై వెళ్తున్న అతడలా ప్రశ్నించే సరికి ఆమెలో ఒక అనుమానం. ఈ విషయం తన ఇంట్లో వాళ్లకు చెప్పిందామె.పాప చెవికి వున్న బంగారు దుద్దుల కోసం తమ కుమార్తెను ఎత్తుకుపోయి ఉండవచ్చని అనుమానించారు కుటుంబ సభ్యులు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా విన్న రాజు అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. 9గంటలకు స్థానికుల సాయంతో చిన్నారి కుటుంబ సభ్యులు రాజు గదికి వెళ్లారు. గదికి తాళం వేసి ఉండటంతో.. తాళం పగలగొట్టే యత్నం చేశారు. కానీ పోలీసులు వద్దన్నారు.రాత్రి పన్నెండు వరకూ ఆమె కోసం వెతికారు. ఇక లాభం లేదని చెప్పి.. రాజు గది దగ్గరకొచ్చి తాళం పగలగొట్టారు. దీంతో అక్కడ పాప మృతదేహం కనిపించడంతో ఒక్కసారిగా చలించిపోయారు. తాము చెప్పినప్పుడే తాళం పగలగొట్టి ఉంటే పాప ప్రాణాలతో దక్కి ఉండేదన్న చర్చ నడిచింది.రాజు కోసం ఈస్ట్ జోన్ డీసీపీ అధ్వర్యంలో పది ప్రత్యేక బృందాలు రాజు కోసం గాలింపు మొదలు పెట్టాయి. సెప్టెంబర్ 15న.. రాజు ఆచూకీ తెలిపితే రూ.10లక్షలు బహుమతి ఇస్తామని ప్రకటించారు సీపీ అంజనీకుమార్. ఒక్క నగరం మాత్రమే కాకుండా.. తెలంగాణ వ్యాప్తంగా పాపకోసం తీవ్రంగా గాలించారు.
సెప్టెంబర్ 16న ఉదయం 8.45గంటలకు స్టేషన్ ఘన్ పూర్ దగ్గర్లోని.. నాష్కల్ రైల్వే ట్రాక్ పై రాజు మృత దేహం గుర్తించారు. నిందితుడు రాజు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని ప్రకటించారు పోలీసులు.
చేతిపై పచ్చబొట్టు ఆధారంగా నిందితుడ్ని గుర్తించామని అంటన్నారు అధికారులు. కోణార్క్ ఎక్స్ ప్రెస్ కింద పడి ఈ సైకో సూసైడ్ చేస్కున్నట్టు ప్రకటించారు. నిందితుడ్ని పట్టుకున్న వెంటనే ఎన్ కౌంటర్ చేయాలన్న డిమాండ్లు చేస్తున్న ఈ తరుణంలో రాజు మృతదేహం లభ్యం కావడం గమనార్హం.
వారంలో ముగిసిన కధ
హైదరాబాద్‌లోని సైదాబాద్‌కు చెందిన ఆరేళ్ల చిన్నారి చైత్ర ఆత్మ శాంతించింది. చైత్రపై అత్యాచారానికి పాల్పడి దారుణంగా హతమార్చిన రాక్షసుడు సరిగ్గా వారం రోజులకే ఆత్మహత్యకు పాల్పపడ్డాడు. పరారీలో ఉన్న నిందితుడు రాజు రైల్వే ట్రాక్‌పై శవమై తేలాడు. ఘట్‌కేసర్ నుంచి వరంగల్ వెళ్లే మార్గంలో రైల్వే ట్రాక్‌పై అతని మృతదేహాన్ని గుర్తించారు. మృతుడి చేతిపై ‘మౌనిక’ అని రాసున్న పచ్చబొట్ట ఆధారంగా మృతదేహం రాజుదేనని పోలీసులు నిర్థారించారు.ఈ నెల 9న సైదాబాద్‌లోని సింగరేణి కాలనీలో చిన్నారి చైత్ర హత్యాచారానికి గురైన ఘటన యావత్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. పరారీలో ఉన్న నిందితుడి కోసం దాదాపు 1000 మంది పోలీసులు 17 బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. నిందితుడు రాజుకి సంబంధించిన సమాచారమిస్తే రూ.10 లక్షల నగదు రివార్డు ఇవ్వనున్నట్లు హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రైల్వే ట్రాక్‌పై అతని మృతదేహం లభ్యమయ్యింది
హర్షాతిరేకాలు
అభం శుభం తెలియని ఆరేళ్ళ పసిపాప పై ఓ మృగాడు దారుణానికి ఒడిగట్టడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు కన్నెర్రజేశారు. అతడిని కఠినంగా శిక్షించాలని.. ముక్తకంఠంతో నినదించారు. ప్రజల నినాదం దేవుడికి వినిపించిందేమో ఆ కిరాతకుడు శవమై తేలాడు. ఆత్మహత్య చేసుకొని నిర్జీవంగా రైలు పట్టాలపై పడి ఉన్నాడు. వ‌రంగ‌ల్ జిల్లాలోని న‌ష్‌క‌ల్‌ రైల్వేట్రాక్‌పై రాజు ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డిన‌ట్లు పోలీసులు తెలిపారు. వేగంగా వ‌స్తున్న రైలుకు ఎదురుగా వెళ్లి రాజు సూసైడ్ చేసుకున్న‌ట్లు లోకో పైల‌ట్ పోలీసుల‌కు తెలిపాడు. చేతి మీద వేయించుకున్న మౌనిక అనే ప‌చ్చ‌బొట్టు ద్వారా రాజుగా పోలీసులు గుర్తించారు. ఇక రాజు మరణం పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. ఆరేళ్ల చిన్నారి చైత్రపై అత్యాచారానికి పాల్పడి.. అత్యంత దారుణంగా హత్య చేసి తప్పించుకుని తిరుగుతున్న రాజు చివరికి ఇలా శవమై కనిపించాడు.
రాజు ఆత్మహత్య చేసుకోవడం పై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ పోస్ట్ చేశారు. అభం శుభం తెలియని ఆరేళ్ళ చిన్నారి పై హత్యాచారానికి పాలుపడిన కిరాతకుడు తనకు తానే శిక్ష విధించుకోవడం బాధిత కుటుంబంతో సహా అందరికీ కొంత ఊరటను కలిగిస్తుంది. ఈ ఘటన పై మీడియా పౌర సమాజం గొప్పగా స్పందించాయి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వంతోపాటు పౌరసమాజం చొరవ చూపాలి. అటువంటి కార్యక్రమం ఎవరు చేపట్టినా.. వారికి నా సహకారం ఉంటుంది. చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం తగిన విధంగా ఆదుకోవాలి.. అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
ప్రజా పోరాటాలు ఫలించాయి
ప్రజా పోరాటాల ఫలితంగానే వెన్నులో వణుకుపుట్టి సైదాబాద్ హంతకుడు రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అన్నారు. సైదాబాద్‌కు చెందిన ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడైన రాజు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడటం తెలిసిందే. ఈ నెల 9న హత్యాచార ఘటన బయటపడినప్పటి నుంచి నిందితుడు రాజు పరారీలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో స్టేషన్ ఘన్‌పూర్‌కు సమీపంలో రాజు రైల్వే ట్రాక్‌పై శవమై తేలాడు. ఘట్‌కేసర్ నుంచి వరంగల్ వెళ్లే మార్గంలో రైల్వే ట్రాక్‌పై అతని మృతదేహాన్ని గుర్తించారు. మృతుడి చేతిపై ‘మౌనిక’ అని రాసున్న పచ్చబొట్ట ఆధారంగా మృతదేహం రాజుదేనని పోలీసులు నిర్థారించారు.దీనిపై స్పందించిన ఎమ్మెల్యే సీతక్క.. ఇది ప్రజల విజయమని అభివర్ణించారు. గత వారం రోజులుగా చైత్ర కుటుంబానికి న్యాయం జరగాలని, రాజును కఠినంగా శిక్షించాలని పోరాటాలు జరుగుతున్నాయని గుర్తుచేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. అయితే నిందితుడు రాజును పట్టుకుని శిక్షించడంలో ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. ప్రజల పోరాటాల ఫలితంగానే వెన్నులో వణుకుపుట్టి నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని అన్నారు. భవిష్యత్తులో ఎవరైన ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడితే ఇదే గతి పడుతున్నారు. ప్రభుత్వాలు స్పందించినా.. స్పందించకపోయినా ప్రజా పోరాటాల కారణంగా ఇలా చావాల్సిన దుస్థితి ఏర్పడుతుందన్నారు. అదే సమయంలో రాజు తప్పులతో సంబంధంలేని అతని బిడ్డను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సీతక్క పేర్కొన్నారు.

Related Posts