YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

అంతా బ్లూ సంపాదనే

అంతా బ్లూ సంపాదనే

అంతా బ్లూ సంపాదనే
ముంబై, సెప్టెంబర్ 16, 
 సినిమాల్లో నటించాలని ముంబయికి వచ్చిన ఔత్సాహికుల యువతులను బలవంతంగా పోర్న్‌ వీడియోల్లో నటింపజేసి.. ఆ వీడియోలను ఓటీటీ యాప్‌లలో విడుదల చేశారన్న అభియోగాలతో రాజ్‌కుంద్రాపై కేసు
నమోదైన విషయం తెలిసిందే. ఈ విషయం బాలీవుడ్‌లో పెను సంచలనాన్ని సృష్టించింది. దీంతో ముంబయి పోలీసులు ఈ కేసును ఛాలెంజింత్‌గా తీసుకొని విచారణ చేపట్టారు. ఇప్పటికే దీనిపై పలువురిని విచారించారు. ఇందులో భాగంగా తాజాగా ముంబయిల పోలీసులు బుధవారం కోర్టులో ఛార్జిషీటును అందజేశారు. పోర్న్‌ వీడియోల ద్వారా రాజ్‌కుంద్రా పెద్ద ఎత్తున ఆర్జించినట్లు పేర్కొన్నారు.ఇదిలా ఉంటే ఈ కేసులో
ముంబయి పోలీసులు రాజ్‌కుంద్రా భార్య, నటీమణి శిల్పాశెట్టిని కూడా కూడా సాక్షిగా చార్జ్‌షీట్‌లో చేర్చారు. దీనిపై ఆమె స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డు చేశారు. ఈ కేసు విషయమై శిల్పా శెట్టి మాట్లాడుతూ.. ‘నేను నా
పనుల్లో చాలా బిజీగా ఉండేదానిని. అసలు రాజ్‌కుంద్రా ఏం చేస్తుండేవాడో కూడా తెలియదు. ఆ విషయం గురించి ఎప్పుడూ పట్టించుకోకపోయేదాన్ని. నాకు హాట్‌షాట్స్‌, బాలీఫేమ్‌ యాప్స్‌ గురించి అసలు
తెలియదు’అని శిల్పా చెప్పుకొచ్చినట్లు పోలీసులు తమ చార్జ్‌ షీట్‌లో పేర్కొన్నారు.ఇక ఈ పోర్న్ రాకెట్‌ను న‌డిపించ‌డానికి రాజ్‌కుంద్రా.. వియాన్ ఇండ‌స్ట్రీస్ లిమిటెడ్ ప‌రిస‌రాల‌ను ఉప‌యోగించుకున్నట్లు చార్జ్‌షీట్‌లో
వెల్లడించారు. ఈ పోర్న్‌రాకెట్ కేసులో జులై 19న పోలీసులు రాజ్‌కుంద్రాను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
 

Related Posts