YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

దక్షిణాది భేటీకి ఈటెల డుమ్మా

దక్షిణాది భేటీకి ఈటెల డుమ్మా

రాష్ట్రాలా హక్కుల సాధన కోసం ఫెడరల్ ఫ్రంట్  అంటున్నా తెలంగాణ సీఎం...మ‌రి అదే స్లోగ‌న్ తో ద‌క్షిణాది రాష్ట్రాల ఆర్దిక మంత్రుల స‌మావేశానికి ఎందుకు డుమ్మా కొడుతున్నారు... ఆర్దిక శాఖ మంత్రుల స‌మావేశానికి తెలంగాణ దూరంగా ఉండ‌టానికి గ‌ల కార‌ణాలేంటి.కేంద్రం వ‌త్తిడిల‌కు తెలంగాణా త‌లొగ్గుతుందా.. అందుకే స‌మావేశాల్ విశ‌యంలో  ద‌క్షిణాది రాష్ట్రాల్లో స‌ప‌రేట్ అయిందా.. తాజా ప‌రిణామాలు చూస్తే అవున‌నే చెప్పాలి.కేంద్రానికి వ్య‌తిరేకంగా వెళ్ల‌కూడ‌ద‌నే దోర‌ణిలోనే తెలంగాణ ఉన్న‌ట్టు అర్దం అవుతుంది.15వ ఆర్దిక సంఘం సిఫార‌సుల‌ను ద‌క్షిణాది రాష్ట్రాలు తీవ్రం వ్య‌తిరేకిస్తున్నాయి.దీంతో అన్ని రాష్ట్రాల‌కు ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని ద‌క్షిణాది రాష్ట్రాల‌న్నీ మొత్తుకున్నా కేంద్రం ప‌ట్టించుకునే ప‌రిస్తితి లేదు.అందుకే ద‌క్షిణాది రాష్ట్రాల ఆర్దిక మంత్రులంతా వ‌రుస స‌మావేశాలు అవుతున్నారు.కానీ తెలంగాణ ప్ర‌భుత్వం దీనికి దూరంగా ఉంటూ వ‌స్తుంది.దక్షిణ రాష్ట్రాల ఆర్థికమంత్రుల భేటీకి తెలంగాణ గైర్హాజ‌రు అవుతూ వ‌స్తుంది..విజయవాడలో జ‌రిగిన  దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశానికి తెలంగాణ సర్కారు తరఫున ఎవరూ హాజరుకాలేదు.. గతంలో కేరళలో జరిగిన సమావేశానికి సైతం రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ హాజరు కాలేదు. విజయవాడలో జ‌రిగిన  సమావేశంలో 15వ ఆర్థిక సంఘం సిఫారసులపైనే ప్రధానంగా చర్చించారు. జనాభా ప్రాతిపదికతోపాటు సిఫారసుల కారణంగా కలిగే నష్టాలపై చర్చించారు. ప్రగతి ఆధారంగా నిధులివ్వాలన్న ఆర్థిక సంఘం సిఫారసులు పలు రాష్ట్రాలకు నష్టం కలిగిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. పది రకాల ఇరడికేటర్లను అధ్యయనం చేసి, తద్వారా రాష్ట్రాలకు నిధులివ్వాలన్న సిఫారసులు అర్ధరహితమనే వాదన అనేక రాష్ట్రాలనురచి వ్యక్తమవుతోంది. ఇది వెనుకబడిన రాష్ట్రాలకు అన్యాయం చేస్తురదన్న అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. అలాగే జనాభా ప్రాతిపదికపైనా ఆరదోళన వ్యక్తమవుతోరది. ఈ నేపథ్యంలో అత్యంత ప్రాధాన్యతగల భేటీకి టీఆర్‌ఎస్‌ సర్కారు తన ప్రతినిధిని పంప‌క పోవ‌డం  ఆశ్చర్యానికి గురి చేస్తున్నది.ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌రిగిన ఆర్దిక‌మంత్రుల స‌మావేశాల‌కు ఆంద్ర‌ప్ర‌దేశ్ ,పాండిచ్చేరి,డిల్లీ,కేర‌ళ‌,పంజాబ్,ప‌శ్చిమ బెంగాల్,క‌ర్నాట‌క‌, రాష్ట్రాల‌కు చెందిన మంత్రులు కానీ .. లేదంటే ఆ రాష్ట్రాల‌కు సంబందించిన ఎవ‌రో ఒక ప్ర‌తినిధి హజ‌రైయి.. త‌మ వాద‌న‌ను వినిపించ‌డ‌మే కాకుండా .. ఆర్దిక మంత్రుల స‌మావేశానికి పూర్తి మ‌ద్ద‌తును ప‌లుకూతూ  వ‌స్తున్నారు.కానీ తెలంగాణ ఒక్క‌టే ఆర్దిక మంత్రుల స‌మావేశానికి దూరంగా ఉంటూ వ‌స్తుంది.తెలంగాణ ప్రభుత్వం తరపున భేటీలో ఎవరూ పాల్గొనకపోవటానికి ప్రధాన కారణం కేంద్ర బెదిరింపులేనని తెలుస్తున్నది. విజయవాడలో జరగిన  సమావేశంలో పాల్గొనవద్దంటూ ఇప్పటికే కేంద్రం నుంచి వివిధ రాష్ట్రాలకు ఆదేశాలు వెళ్లాయని సమాచారం. అయితే తమకు ఆర్థికంగా నష్టం జరుగుతున్న నేపథ్యంలో సమావేశంలో పాల్గొని తీరతామంటూ పలు రాష్ట్రాలు చెప్పేశాయి. ఈ క్రమంలోనే విజయవాడ భేటీకి పలు రాష్ట్రాల నుంచి ఆర్థిక మంత్రులు, ప్రతినిధులు హాజరైయ్యారు.. కానీ తెలంగాణ సర్కారు మాత్రం దూరంగా ఉండటం గమనార్హం. ఓవైపు జాతీయస్థాయిలో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు గురించి తెలంగాణ ముఖ్యమంత్రి చర్చలు జరుపుతున్నారు. రాష్ట్రాల హక్కులు.. ఆర్థికాంశాలపై కేంద్రం పెత్తనం పెరిగిపోతున్నదంటూ సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటప్పుడు కనీసం పొరుగురాష్ట్రంలో నిర్వహించే దక్షిణాది రాష్ట్రాల ఆర్థికమంత్రుల సమావేశానికి తెలంగాణ తరఫున ప్రతినిధిగా ఎవరినీ పంపకపోవటంపై చర్చనీయాంశంగా మారింది.

Related Posts