YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

బీహెచ్ఈఎల్ స్వాధీనం చేసుకున్న పినరయి

బీహెచ్ఈఎల్ స్వాధీనం చేసుకున్న పినరయి

తిరువనంతపురం, సెప్టెంబర్ 17, 
కేరళ ఒక్క రాష్ట్రమే కమ్యునిస్టుల ఖాతాలో మిగిలి ఉంది. ఆ ఒక్క రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వామ పక్షాలపై ఉంది. తొలి నుంచి కంచుకోటగా ఉన్న కేరళలో రెండుసార్లు పినరయి విజయన్ ఘన విజయం సాధించి ముఖ్మమంత్రి అయ్యారు. వరసగా రెండు సార్లు పార్టీని అధికారంలోకి తెచ్చి రికార్డు సృష్టించారు. కానీ పినరయి విజయన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వరదలు, కరోనా వంటి విపత్తులతో ఆర్థికంగా రాష్ట్రం అతలాకుతలమవుతుంది. ఇప్పటికీ కరోనా కేరళను వదలలేదు. అత్యధికంగా రోజువారీ నమోదవుతున్న రాష్ట్రాల్లో కేరళ ముందుంది. కేరళలో రోజుకు ఇరవై అయిదు నుంచి ముప్ఫయి వేల కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే శక్తికి మించి పినరయి విజయన్ అప్పులు చేశారు. దాదాపు మూడు లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని నడుపుతున్నారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం దూకుడు పెంచింది. దేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరించాలని అధికారంలో ఉన్న బీజేపీ నిర్ణయించిన సంగతి తెలిసిందే.విశాఖలో ఉన్న స్టీల్ ప్లాంట్ ను సయితం ప్రయివేటీకరిస్తున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వంపైన వ్యతిరేకత వ్యక్తమవుతున్నా ఆ ప్రభావం రాష్ట్ర ప్రభుత్వంపైనా పడుతుంది. ప్రయివేటీకరణను అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా విఫలమయిందన్న ఆరోపణలు వచ్చే అవకాశముంది. అందుకే పినరయి విజయన్ ఆ అవకాశం ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. కేరళలో బీహెచ్ఈఎల్ ను ప్రయివేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
కేరళలోని కాసరగూడ జిల్లాలో బీహెచ్ఈఎల్-ఈఎంఎల్ సంస్థ ఉంది. దీనిని ప్రయివేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే పినరయి విజయన్ మాత్రం దీనిని సమర్థవంతంగా అడ్డుకున్నారు. ఈసంస్థను 77 కోట్ల రూపాయలను ఖర్చు చేసి రాష్ట్ర ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకుంది. రెండేళ్లుగా ఈ సంస్థలో ఉద్యోగులకు బకాయీ పడిన జీతాలను చెల్లించేందుకు మరో 14 కోట్లు కేటాయించింది. దీంతో పినరయి విజయన్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ నిర్ణయం మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా మారాలి.

Related Posts