YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో మళ్లీ రంగంలోకి పీకే

ఏపీలో మళ్లీ రంగంలోకి పీకే

విజయవాడ, సెప్టెంబర్ 17,
ఇంకా ఎన్నికలకు రెండున్నరేళ్లు మాత్రమే సమయం ఉంది. అధికార వైసీపీ మరోసారి గెలవాలన్న పట్టుదలతో ఉంది. ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశం సందర్భంగా జగన్ తన మనసులోని మాటను మంత్రుల ముందు ఉంచారు. మంత్రి వర్గ సమావేశంలో జగన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. ఎన్నికలకు ఇప్పటి నుంచే అందరూ సిద్ధం కావాలని ఆయన మంత్రులకు సూచించిడం చర్చనీయాంశమైంది.
ఎన్నికలకు సిద్ధం కావాలంటే ముందస్తు ఎన్నికలకు వెళతారా? లేక ఈ రెండున్నరేళ్లు సమయాన్ని వచ్చే ఎన్నికల కోసం వెచ్చించాలా? అన్న క్లారిటీ మాత్రం రాలేదు. ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేకత రాకముందే ఎన్నికలకు వెళ్లాలన్న యోచన కూడా జగన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటివరకూ సంక్షేమం తప్ప అభివృద్ధి ఏపీలో ఎక్కడా కనపడదు. ఈ రెండున్నరేళ్లలో అభివృద్ధి పనులు చేపట్టాలన్నా ఆర్థిక పరిస్థితులు అందుకు అనుకూలించవు.అందుకే వ్యతిరేకత ముదరకముందే ఎన్నికలకు వెళతారా? లేక 2024లోనే ఎన్నికలకు వెళ్లనున్నారా? అన్న స్పష్టత లేకపోయినా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని జగన్ మంత్రి వర్గ సమావేశంలో జగన్ సంకేతాలు ఇచ్చారు. అయితే ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే వచ్చే ఏడాది నుంచి పీకే టీం ఏపీలో వైసీపీ కోసం పనిచేస్తుంది. ఈ విషయాన్ని జగన్ మంత్రులకు స్వయంగా చెప్పడంతో పీకే మళ్లీ వ్యూహకర్తగా వ్యవహరిస్తారన్నది తేలిపోయింది.మొత్తం మీద ఎన్నికల మూడ్ లోకి వైసీపీ వెళ్లిపోయిందనే చెప్పాలి. ఈ రెండున్నరేళ్లలో విపక్షాలు ఖచ్చితంగా ఒంటికాలి మీద ప్రభుత్వం మీద పడతాయి. వాటిని అడ్డుకుంటూ ప్రజల్లోకి బలంగా వెళ్లాలన్నది జగన్ ఆలోచన. అందుకే తాను రచ్చబండ కార్యక్రమాన్ని కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. విపక్షాలు వచ్చే ఎన్నికల కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టే సమయంలో, అధికార వైసీపీ కూడా ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయిందనే చెప్పాలి.

Related Posts