హైదరాబాద్ సెప్టెంబర్ 17
గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసఘం సమావేశం ముగిసింది. హైదరాబాద్‌లోని జలసౌధాలో బీపీ పాండే నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి గోదావరి నదీ యాజమాన్య బోర్డు సభ్యులు, తెలంగాణ, ఏపీ అంతర్రాష్ట్ర వ్యవహారాల సీఈలు, రెండు రాష్ట్రాల జెన్‌కో అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గెజిట్ అమలుకు సంబంధించి వ్యవస్థాగత నిర్మాణం, ప్రాజెక్టులకు సీఐఎస్ఎఫ్ భద్రతా తదితర అంశాలపై చర్చించారు. గోదావరిపై ఉన్న అనుమతిలేని అన్ని ప్రాజెక్టుల డీపీఆర్‌లను నెల రోజుల్లోగా అందజేయాలని ఇరు రాష్ట్రాలకు బోర్డు సూచించింది.