YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

చమన్ మృతితో తీవ్రభావోద్వేగానికి గురైన సునీత

చమన్ మృతితో తీవ్రభావోద్వేగానికి గురైన సునీత

దివంగత నేత పరిటాల రవి ప్రధాన అనుచరుడు చమన్ సాబ్ హఠాన్మరణ వార్త వినగానే మంత్రి పరిటాల సునీత తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కళ్లు తిరిగి స్పృహతప్పి పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన ఆమె కుమారుడు పరిటాల శ్రీరామ్ ఆమెను కిందపడకుండా పట్టుకొని ఆస్పత్రి బెడ్‌పైకి తరలించారు. సునీత ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. పరిటాల రవి ప్రధాన అనుచరుడైన చమన్ ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. పరిటాల రవి కుమార్తె స్నేహలత వివాహ వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్న చమన్‌ రెండు రోజులుగా వెంకటాపురంలోనే ఉన్నారు. సోమవారం ఉదయం ఆయనకు అకస్మాత్తుగా గుండె పోటు వచ్చింది. దీంతో వెంటనే ఆయణ్ని అనంతపురంలోని సవేరా ఆస్పత్రికి తరలించారు. కుమారుడు శ్రీరామ్‌తో కలిసి ఆస్పత్రికి చేరుకున్న మంత్రి సునీత ఉదయం నుంచి అక్కడే ఉండి చమన్ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. అయితే.. చికిత్స కొనసాగుతుండగానే చమన్ ఆకస్మికంగా మరణించారు. 

Related Posts