జక్కంపూడి కుటుంబం జోలికి వస్తే తోకలు కత్తిరిస్తాం ఒకసారి ఎంపీగానే మిగిలిపోతారు ఏడు నియోజకవర్గాల అభివృద్ధిపై ఎంపీ దృష్టిసారించాలి * రాజమహేంద్రవరం ఎస్సీ ఎస్టీ నాయకులు హెచ్చరిక
పార్టీ ఆవిర్భావం నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి వెన్నంటి అండగా ఉండి, ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జండాను భుజాలపై మోసిన జక్కంపూడి కుటుంబంపై ఆరోపణలు చేస్తే సహించేది లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు మాసా రామ్ జోగ్ పేర్కొన్నారు.
శుక్రవారం రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పై ప్రజలలో చైతన్యం తీసుకువచ్చి పార్టీ ని అధికారంలోకి తీసుకువస్తే, సింగిల్ మెన్ ఆర్మీగా పార్టీలోకి వచ్చి పార్టీకి నష్టం కలిగించే ఈ విధంగా ప్రవర్తిస్తే సహించేది లేదని అన్నారు.
కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకు వస్తే ఎన్నికల కు ముందు పార్టీ లోకి వచ్చిన ఎంపీ దాన్ని ప్రతిఫలం అనుభవిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చరిష్మాతో నెగ్గిన ఎంపీ రాజమహేంద్రవరం పార్లమెంటు అభివృద్ధిపై దృష్టి సారించాలని అన్నారు.
గత రెండున్నర సంవత్సరాల కాలంగా రాజానగరం నియోజవర్గం అని రంగంలో అభివృద్ధి సాదించిందని అన్నారు. రైతు భరోసా కేంద్రాలు, రోడ్లు,గ్రామ సచివాలయాలు , గ్రామాలలో ఇతర మౌలిక వసతులు కల్పించారని పేర్కొన్నారు. ఆచరణ సాధ్యం కాని 45 కార్యక్రమాలను అమలు చేస్తామని ఎంపీ హామీలు ఇస్తున్నారని విమర్శించారు. 10 సంవత్సరాల కాలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కష్టపడి పార్టీ కోసం పని చేశారని అన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వారిని తొక్కిపెట్టి కొత్త వారిని వారి నెత్తి మీద కూర్చోబెడితే సహించేది లేదని అన్నారు.
బర్రె కొండబాబు అతని కుమారుడు అబ్బా కొడుకులు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు.తండ్రి ఒక పార్టీ అయితే కొడుకు మరో పార్టీ అని అన్నారు. కుమారుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రతిరోజు తిడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాళ్లు కొట్టుకునే బర్రె కొండబాబు ని తీసుకువచ్చి దివంగత నేత మాజీమంత్రి శ్రీ జక్కంపూడి రామ్మోహన రావు కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు ఇచ్చారని తెలిపారు.ఈరోజు తెల్ల బట్టలు వేసుకుని కార్లో తిరుగుతున్నారు అంటే అది జక్కంపూడి కుటుంబం చలవే అని గుర్తించాలని అన్నారు.
తల్లి పాలు తాగి రొమ్మును గుద్దినట్లు నానుడి వలే బర్రే కొండబాబు వ్యవహరిస్తున్నారని అన్నారు. మేలు చేసిన వ్యక్తి పై విశ్వాసం ఉండాలని పేర్కొన్నారు. జక్కంపూడి కుటుంబంపై ఆరోపణలు చేస్తే తోకలు కత్తిరిస్తామని హెచ్చరించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జె.కే అరుణ మాట్లాడుతూ రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ రామ్ బట్టల పై వేసుకునే శ్రద్ధ రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి పై లేదని విమర్శించారు