YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

తెలంగాణ కు స్వాతంత్రం ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ది టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి

తెలంగాణ కు స్వాతంత్రం ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ది టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి

హైదరాబాద్
తెలంగాణలో సాయుధ రైతాంగ పోరాటం దేశ చరిత్రలో ప్రధాన ఘట్టం. బ్రిటిష్ నుంచి భారత్ కు స్వాతంత్ర్య వచ్చినపుడు నిజాం పాలకులు ఇండియాలో విలీనం చేయకుండా స్వతంత్రంగా ఉండాలని లేదా, పాకిస్తాన్ లో విలినం చేయాలని చూసారు. అప్పుడు ప్రధాని జవహర్ లాల్ ఆదేశాలతో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో జరిపి తెలంగాణను భారత్ లో విలీనం చేశారని టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ కు స్వాతంత్రం వచ్చిన రోజు ఈ రోజు, తెలంగాణ కు స్వాతంత్రం ఇచ్చిన ఘనత కాంగ్రెసది. ఇప్పుడు కొంతమంది కొత్త బిచ్చగాళ్ల వచ్చారు. వెయ్యి ఉరి ల ఉడల మర్రికి వస్తున్నారు. అది ఎప్పుడు జరిగిందో కూడా వాళ్లకు తెలియదు.  జవాహర లాల్ నెహ్రు నిర్ణయం వల్లనే తెలంగాణ విలీనం జరిగింది. ప్రధాన మంత్రి నిర్ణయం హోమ్ శాఖ మంత్రి అమలు చేస్తారు. బీజేపీ వాళ్ళు తెలంగాణ విలినాన్ని హోమ్ శాఖ మంత్రి సర్దారవల్లభయ్ పటేల్ ది అని చెప్తున్నారు.  సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా కాంగ్రెస్ అధ్యక్షులుగా కేంద్ర హోమ్ శాఖ మంత్రిగా పని చేసారు. బీజేపీ వాళ్లకు చెప్పుకోవడానికి ఒక్క నాయకులు కూడా లేరు అందుకే కాంగ్రెస్ నేతల పేర్లు వాడుకుంటున్నారు. తెలంగాణలో నిజాం కు వ్యతిరేకంగా దొడ్డి కొమురయ్య, షాయబుల్లాఖాన్, రాంజీ, చాకలి అయిలమ్మ, కొమురం భీం ల పోరాట స్ఫూర్తి తో పని చేస్తామని అన్నారు.
ఇక్కడ హిందువులు, ముస్లింలు కలిసి నిజాం కు వ్యతిరేకంగా పోరాటం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం.అధికారంలోకి వచ్చాక సెప్టెంబర్ 17ను తెలంగాణ స్వతంత్ర దినోత్సవంగా అధికారికంగా జరుపుతామని అన్నారు.

Related Posts