YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

కాల్ మనీ కాలనాగు మల్లి కోటేశ్వరావు  సస్పెండ్

కాల్ మనీ కాలనాగు మల్లి కోటేశ్వరావు  సస్పెండ్

కాల్ మనీ కాలనాగు మల్లి కోటేశ్వరావు  సస్పెండ్
నెల్లూరు
నెల్లూరు జిల్లా, గూడూరులో కాల్ మనీ  కాలనాగు మల్లి కోటేశ్వరరావుని విద్యుత్ శాఖ ఉద్యోగి పిర్యాదు మేరకు  విద్యుత్ శాఖ ఉన్నతధికారులు సస్పెండ్ చేశారు.
కాల నాగు మల్లి కోటేశ్వరరావు మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని బాధితురాలు నర్రా శకుంతల డిమాండ్ చేశారు.విద్యుత్ శాఖలో గూడలి లైన్ మెన్ గా పనిచేస్తూ, అధిక వడ్డీలు పేరుతో ప్రభుత్వ ఉద్యోగస్తుల జీవితాలతో  ఆడుకోవడం తో పాటు , ఎంతోమందిని వేధించి కోట్ల రూపాయల అక్రమార్జన చేసిన మల్లి కోటేశ్వరావు మీద విద్యుత్ శాఖ నర్రా శకుంతల ఇచ్చిన పిర్యాదు మేరకు విచారణ జరిపి మల్లి కోటేశ్వర రావుని విద్యుత్ శాఖ ఉన్నత ధికారులు గురువారం అం సాయంకాలం సస్పెండ్ చేసినట్టు అధికారులు తెలియచేశారు.కాల్ మనీ వ్యవహారంలోనే నర్రా శకుంతల అనే దళిత మహిళ ని  మానసికంగా వేధించడంతో పాటు గత 9 సంవత్సరాలుగా ఆమె జీతం మొత్తం మల్లి కోటేశ్వరరావు తన ఖాతాలోకి మల్లించుకుని ఖాళీ  చెక్కులు, ఏటీఎం కార్డు,ఫారం 16 లు కూడా తన పేరు మీద రాయి తీసుకున్నట్లు అధికారుల విచారణలో బయట పడింది.అదే విద్యుత్ శాఖ నుండి సుమారుగా 40 మంది పైగా మళ్లీ కోటేశ్వరావు బాధితులుగా ఉన్నట్టు సమాచారం. ఈమధ్య నర్రా శకుంతల అనే దళిత మహిళ  ఫిర్యాదు మేరకు గూడూరు పట్టణంలోని 2వ పట్టణ పోలీస్ స్టేషన్ లో  పిర్యాదు చేయగా, ఈ ఫిర్యాదు మీద మల్లి కోటేశ్వరరావును అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టడం కూడా జరిగింది.
పోలీస్ శాఖ కూడా కాల్ మనీ కోటేశ్వరరావు మీద వచ్చిన ఫిర్యాదుని లోతుగా దర్యాప్తు చేస్తే, మరిన్ని  నిజాలు బయట పడే అవకాశం ఉందని బాధ్యత ఉద్యోగులు కొందరు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.
అలాగే దళిత మహిళ నర్రా శకుంతల  ఇచ్చిన ఫిర్యాదుని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుగా నమోదు చేయాలని నర్రా శకుంతల కోరుతున్నారు.
మల్లి కోటేశ్వరరావు సస్పెండ్ తో బాధితులకు న్యాయం జరిగేనా?. పదుల సంఖ్యలో మల్లి కోటేశ్వరరావు బాధితులు తమ లక్ష రూపాయలు డబ్బులు, ఆస్తులు,ఇళ్ళు పోగొట్టుకున్నమని ఎంతో మంది వీదిపాలు అయినట్టు, బాధితులు మొరపెట్టుకున్నారు. వీటి మీద  కూడా పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తే గాని ,నిజాలు పూర్తిగా బయటపడి తమకు   న్యాయం జరిగే అవకాశం ఉండదని, కావున మల్లి కోటేశ్వరరావు ఖాతాలను ఆర్థిక లావాదేవీలను పరిశీలించి, తమకు న్యాయం జరిగేలా చూడాలని కాల్ మనీ బాధితులు కోరుతున్నారు.

Related Posts