YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలంగాణకు అమిత్ షా టూర్

తెలంగాణకు అమిత్ షా టూర్

తెలంగాణ లో బీజీపీని  అధికారంలోకి తెచ్చేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు బీజెపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ హైదరాబాద్ లోని బీజెపీ రాష్ట్రకార్యాలయంలో తెలిపారు. ఈ నెల 14న బీజేపీ జీతీయ  అధ్యక్షుడు అమిత్ షా తో తెలంగాణ బీజేపీ నేతలు సమావేశం కానున్నట్లు తెలిపారు. జూన్ లో అమితా షా తెలంగాణ పర్యటనకు రానున్నట్లు లక్ష్మణ్ తెలిపారు. అమిత్ షా పర్యటన విధి విధానాలు ఖరారు కోసం ఈ నెల 17,18 తేదిలలో హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో  సమావేశం కానున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి ఆలిండియా జనరల్ సెక్రటరీ  సతీష్ హజరుకానున్నట్లు తెలిపారు.ఇటీవలే తెలంగాణలో పర్యటించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ... హైదరాబాద్ లో రెండు రోజుల క్రితం 1500కోట్ల రూపాయల నిధులతో రోడ్ల అభివృద్ధి కి శంకుస్థాపన చేశారని తెలంగాణ కు 45వేల కోట్ల రూపాయలను గడ్కరీ తన శాఖ నుంచి ఖర్చు చేస్తున్నారు లక్ష్మన్ తెలిపారు.పూణే నుండి హైదరాబాద్ కు, హైదరాబాద్. నుండి ఔరంగబాద్ తో పాటు మరికొన్ని జాతీయ రహదారులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర బీజేపీ తరుపున గడ్కరీ ని కోరాం అని లక్ష్మణ్ తెలిపారు.నాలుగు ఏళ్ల లో తెలంగాణ కు 3వేల కిలోమీటర్ల రోడ్లను జాతీయ రహదారులుగా మార్చిన ఘనత గడ్కరీ దే.. నని  లక్ష్మణ్  అన్నారు. తెలంగాణ ఏర్పడక ముందు..రాష్ట్ర:లో 2వేల500కిలోమీటర్ల రోడ్లు మాత్రమే  జాతీయ రహదారులుగా ఉండేవని అన్నారు.గోదావరి పై రెండు జలాశయాలు నిర్మిస్తున్నట్లు లక్ష్మణ్ అన్నారు. 50 వేల కోట్ల రూపాయల తో జల రవాణా మార్గం ఏర్పాటు కు చర్యలు.ఈ ప్రాజెక్టు పూర్తి అయితే  నదుల అనుసంధానం లో భాగంగా ఏ పి,తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు తాగు, సాగు నీటి సమస్య పరిష్కారం అవుతుందని  లక్ష్మణ్ అన్నారు. ఇంత అభివృద్ధి ని మోడీ ప్రభుత్వం చేస్తున్నప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు,  కేంద్రం పై అనవసర నిందలు వేయడం సరికాదని అన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ కోసం కేంద్రం 5వేల కోట్ల రూపాయల ను ఖర్చు చేస్తుందని లక్ష్మణ్ తెలిపారు.కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కూడా కేంద్రం అన్ని రకాల అనుమతులు మంజూరు చేసినా.. కేంద్రం ను తెలంగాణ ప్రభుత్వం విమర్శలు చేయడం దారుణం అని చెప్పారు.గత కాంగ్రెస్ హయాంలో  తెలంగాణ కు ఎన్ని నిధులు ఇచ్చారు.... ఈ నాలుగేళ్ళ లో బీజేపీ ప్రభుత్వం... తెలంగాణ కు ఎంత ఖర్చు చేసిందో,ఎంత అభివృద్ధి జరిగిందో చర్చ కు బీజేపీ సిద్ధం అని సవాల్ విసిరారు.తెలుగుదేశం పార్టీ..కర్ణాటక లో కాంగ్రెస్ గెలవాలని కోరుకొంటుంది...ఇది ఎన్టీఆర్ ఆత్మ ను క్షోభించినట్లు చేయడమే అని అన్నారు ఇక టిఆర్ ఎస్ మాత్రం జే డి ఎస్ గెలవాలని కోరుకుంటుందని  ఇలా తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరు బీజేపి ని ఓడించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు విమర్శించారు.. 

Related Posts