YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రైతులకు అందుబాటులో లేని రైతు భరోసా కేంద్రాలు  అయోమయంలో రైతులు

రైతులకు అందుబాటులో లేని రైతు భరోసా కేంద్రాలు  అయోమయంలో రైతులు

రైతులకు అందుబాటులో లేని రైతు భరోసా కేంద్రాలు
 అయోమయంలో రైతులు
 ప్రైవేటు వ్యక్తుల నుండి ఎరువులను కొనుగోలు చేస్తున్న రైతులు
పత్తికొండ
పత్తికొండ మండల పరిధిలోని అన్ని గ్రామాలలో  రైతుకు సరైన  సమయంలో సరైన ఎరువులు,మందులు  అందించలేనటువంటి రైతు భరోసా కేంద్రాలు ఎందుకు ఏర్పాటు చేసినట్లు తెలియజేయాలని పలువురు రైతులు తెలియజేస్తున్నారు.రైతు ఎన్నో విధాలుగా నష్టాలు ఎదుర్కొంటూనే తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు.రేయనకా పగలనకా కష్టించిన రైతుకు అడుగడుగునా అన్యాయం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.విత్తు నాటిన మొదలు పంట అమ్ముకునే వరకు రైతులు దోపిడీకి గురవుతున్నారని,ఒక వైపు నకిలీ మందులు, మరోవైపు బ్లాక్ మార్కెట్లో ధరలు కుంభకోణం వలన ప్రతి ఒక్క రైతు అప్పుల పాలౌవుతున్నాడని పలువురు రైతులు తెలియజేస్తున్నారు.పంట సృష్టికర్త అన్నదాతను ఆదుకోవాల్సిన అధికారులు అడుగడుగునా అన్యాయం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.రైతుభరోసా కేంద్రాల నిర్మాణం నత్తనడకలా జరుగుతున్నాయి.పత్తికొండ పరిసర ప్రాంతాల్లో ఎరువుల వాడకం అధికంగా ఉంటుంది,కానీ ఎరువుల కోసం ఆర్‌బీకే లపై ఆధారపడిన రైతులు ఆశలు నిరాశలు అవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వ్యవసాయాధికారులు స్పందించి రైతు భరోసా కేంద్రాల ద్వారా సకాలంలో రైతులకు సబ్సిడీ ధరలకు ఎరువులు,మందులు అందించి రైతులను ఆదుకోవాలని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related Posts