చంద్రబాబు ఇంటి దగ్గర ఉద్రిక్తత
విజయవాడ, సెప్టెంబర్ 17,
అమరావతిలోని మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఇంటిపై వైసీపీ నాయకులు శుక్రవారం దాడికి పాల్పడ్డారు. వైసీపీ నేతలు జెండాలు, కర్రలతో బాబు ఇంటి వద్దకు వచ్చారు. పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ కూడా అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు బాబు ఇంటికి వద్దకు చేరుకుంటున్నారు. గురువారం మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ నేతలు అందోళన చేపట్టారు. చంద్రబాబు క్షపాపణ చెప్పలని డిమాండ్ చేశారు. ఇంటిపై దాడికి యత్నించడంతో టీడీపీ నేతలు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో వైసీపీ నేతలు రాళ్లతో దాడికి పాల్పడ్డారు.
ఒకవైపు బుద్ధా వెంకన్న. మరో వైపు జోగి రమేష్. వారిద్దరి తోపులాటతో ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటి దగ్గర హైటెన్షన్ నెలకొంది. అయ్యన్నపాత్రుడు సీఎం జగన్‌పై చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా చంద్రబాబు ఇంటి దగ్గర నిరసనకు దిగారు వైసీపీ నేతలు. ఎమ్మెల్యే జోగి రమేష్ అక్కడకు వెళ్లారు. అప్పటికే అక్కడికి మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న చేరుకున్నారు. జోగి రమేష్ వెళ్లే సరికి బుద్ధా వెంకన్న వారిని అడ్డుకున్నారు.ఇరు వైపుల పెద్దయెత్తున కార్యకర్తలు అక్కడి చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కరకట్టపై ఉన్న పోలీస్ చెక్‌పోస్ట్ దగ్గరే వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్నారు బుద్ధా వెంకన్న అనుచరులు. ఆ సమయంలో పోలీసులు వచ్చి అదుపు చేసినా ఎవరూ వినలేదు.జెండా కర్రలతోనూ వైసీపీ, టీడీపీ కార్యకర్తలు కొట్టుకున్నారు. కొందరి షర్ట్‌లు చిరిగిపోయాయి. బుద్ధా వెంకన్న, జోగి రమేష్ ఇద్దరూ చేతులు పట్టుకుని తోసుకున్నారు. చంద్రబాబు ఇంటి వైపు వెళ్లేందుకు జోగి రమేష్ తీవ్రంగా ప్రయత్నించారు. ఆయన్ను బుద్ధా వెంకన్న అడ్డుకున్నారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది
జగన్ ఇంటి దారుల మూసివేత
సీఎం జగన్ నివాసం వైపు వెళ్లే అన్నిదారులను పోలీసులు మూసివేశారు. సీఎం నివాసం వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. సీఎం నివాస మార్గాల్లో భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌ను జాతీయ రహదారిపైకి మళ్లించారు. అమరావతిలోని మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఇంటిపై వైసీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. వైసీపీ నేతలు జెండాలు, కర్రలతో బాబు ఇంటి వద్దకు వచ్చారు. పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ కూడా అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలోన సీఎం జగన్ నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు